Breaking News

ఈ గ్రామం చాలా స్పెషల్‌!..కిచెన్‌ ఒక దేశంలో ఉంటే..బెడ్‌రూం ఏకంగా..

Published on Sun, 06/02/2024 - 11:55

నాగాలాండ్‌లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్‌ అంటే..ఒకే ఇంట్లో  రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్‌ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్‌ బోర్డర్‌ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్‌ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్‌ హంటింగ్‌కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్‌ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్‌బిల్‌​ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. 

ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్‌లోని కున్యాక్‌ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్‌  సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్‌ మయన్మార్‌లో ఉంటే బెడ్‌రూం ఏకంగా భారత్‌లో ఉంది. 

దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్‌ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. 

(చదవండి: 'లంగ్స్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్‌..)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)