Breaking News

బిర్యానీ పుట్టింది ఎక్కడ?.. అసలు చరిత్ర ఇదే!

Published on Mon, 08/03/2026 - 14:08

బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. సువాసన, మసాలాల దమ్‌ బిర్యానీ ఘుమఘుమలు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్‌ అనగానే చార్మినార్‌తో పాటు బిర్యానీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఈ అద్భుతమైన వంటకం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌లోనే పుట్టిందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇక్కడే లభిస్తుంది.

పర్షియాలో మొదలు
చరిత్రకారుల ప్రకారం బిర్యానీ అనే పదానికి మూలం పర్షియన్‌ భాషలో ఉన్నాయి. దీని ప్రకారం బిరియన్‌ అంటే వేయించడం లేదా ఫ్రై  చేయడం, బిరింజ్‌ అంటే బియ్యం అనే రెండు పదాల నుంచి వచ్చిందని అంటారు. ఈ వంటకం పుట్టుక మాత్రం సుమారు 11 నుంచి 14వ శతాబ్దం మధ్య కాలంలో ఇరాన్‌ అంటే ఒకప్పటి పర్షియాలో జరిగిందని చెబుతారు. 

అక్కడ బియ్యం, మాంసం అండ్‌ సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేసే వంటకాలు తరువాత కాలంలో బిర్యానీ రూపం తీసుకున్నాయి.

భారత్‌లో ఎంట్రీ ఎప్పుడు అంటే ..?
1526లో మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్‌ తనతో పాటు పర్షియన్‌ సంస్కతి, భాష, వంటకాలను భారతదేశానికి తీసుకువచ్చాడు. తరువాత హుమాయున్‌ , అక్బర్‌ కాలంలో రాజమందిరాల్లోని కిచెన్‌ బిర్యానీ నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకుంది. అప్పట్లో బిర్యానీని ప్రధానంగా రాజులు, సైనిక ముఖ్య అధికారులు, రాజభవనాల్లో పని చేసే ముఖ్య సిబ్బందికి మాత్రమే వడ్డించేవారు.

ముంతాజ్‌ మహల్‌ కథ
బిర్యానీకి సంబంధించిన మరో కథ బాగా పాపులర్‌ అయింది. 17వ శతాబ్దంలో మహారాణి ముంతాజ్‌ మహల్‌ తన సైనికులు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలతో నిండిన భోజనం తయారు చేయమని రాయల్‌ కుక్స్‌కు సూచించిందట. అప్పుడు మాంసం, బియ్యం, నెయ్యి, అనేక సుగంధ ద్రవ్యాలను ఒకటే పాత్రలో వండగా అది బిర్యానీగా పాపులర్‌ అయిందని చెబుతారు. ఈ కథకు బలమైన చారిత్రాత్మక ఆధారాలు లేవు కానీ ఇది బిర్యానీ గురించి అత్యంత పాపులర్‌ స్టోరీల్లో ఇది కూడా ఒకటి. 

హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ ఎంట్రీ
1724లో మొదటి అసఫ్‌ జాహ్‌ హైదరాబాద్‌లో అసఫ్‌ జాహీ వంశాన్ని స్థాపించాడు. తరువాత  పర్షియన్, మొఘల్‌ వంటకాలతో పాటు తెలుగు వంటకాల్లో రకరకాల ఎక్స్‌పరిమెంట్స్‌ ్రపారంభమయ్యాయి. నిజాం కాలంలో దమ్‌ పద్ధతిలో బిర్యానీ తయారు చేయడం బాగా పాపులరైంది. పెద్ద హండీలో బియ్యం, మాంసం, మసాలాలను ΄÷రలుగా పేర్చి, పిండితో మూసి, తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించే పద్ధతినే దమ్‌ అని పిలుస్తారు. ఈ పద్ధతి వల్లే హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

భారతదేశంలో ఉన్న బిర్యానీ వెరైటీలు
భారతదేశంలో ప్రతి ్రపాంతంలో ఒకో వెరైటీ బిర్యానీ లభిస్తుంది. స్థానికులు తమ అభిరుచి, మసాలాలు, వంట దినుసులు, కల్చర్‌ను బట్టి బిర్యానీని కస్టమైజ్‌ చేసుకున్నారు.

హైదరాబాద్‌లో బిర్యానీని దమ్‌ బిర్యానీ అంటారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో అవధి బిర్యానీ, కలకత్తాలో బంగాళదుంపతో చేసే కలకత్తా బిర్యానీ, తమిళనాడులోని ఆంబూరులో అంబూర్‌ బిర్యానీ, డిండిగల్‌లో డిండిగల్‌ బిర్యానీ, కేరళలోని మలబార్‌ బిర్యానీ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కశ్మీరీ బిర్యానీ పాపులర్‌ అయ్యాయి.

దీంతో పాటు అంత పాపులర్‌ అవ్వక΄ోయినా రుచికరంగా ఉండే మురాదాబాద్‌ బిర్యానీ వంటి ఎన్నో లోకల్‌ టచ్‌ ఉన్న బిర్యానీ ఫ్లేవర్స్‌ఉన్నాయి.

ప్రతి బిర్యానీలో మసాలా, బియ్యం, మాంసంతో అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే స్థానిక వంట విధానాలు, పదార్థాల మార్పుతో రుచి మారుతుంది. ప్రతి బిర్యానీ వెరైటీకి ఒక కథ, చరిత్ర ఉంటుంది.

హైదరాబాద్‌ను బిర్యానీ రాజధాని అని ఎందుకు అంటారు?
హైదరాబాద్‌లో నైజాం సంస్కతి, పర్షియన్‌ ప్రభావం, తెలుగు రుచులు, స్థానిక సుగంధ ద్రవ్యాల కలయిక బిర్యానీకి ఒక కొత్త గుర్తింపు ఇచ్చింది.
నేడు హైదరాబాద్‌లో వందల సంఖ్యలో హోటళ్లలో బిర్యానీ తయారు చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లాంటి దేశాల్లో కూడా హైదరాబాద్‌ బిర్యానీ అనే పేరు ఒక బ్రాండ్‌గా మారింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)