Breaking News

పిల్లలకు ఫోన్‌ ఎప్పుడు ఎలా ఇవ్వాలి?

Published on Sat, 02/14/2026 - 22:40

‘మా అబ్బాయికి ఫోన్‌ ఎప్పుడు ఇవ్వాలి?’‘మా అమ్మాయి ఫోన్‌ లేకుండా అన్నం తినడం లేదు, ఏం చేయాలి?’ అని చాలామంది పేరెంట్స్‌ అడుగుతుంటారు. నేటి హైటెక్‌ యుగంలో పిల్లలకు ఫోన్‌ ఇవ్వడం తప్పనిసరి అవసరంగా మారింది. పిల్లలకు సెల్‌ ఫోన్‌ పరిచయం చేయడం అనేది కేవలం ఒక పరికరాన్ని ఇవ్వడం కాదు, ఒక అపరిమితమైన, నియంత్రణ లేని ప్రపంచానికి వారిని పరిచయం చేయడం. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు, శాస్త్రీయ దృక్పథం, పరిష్కారాల గురించి చర్చిద్దాం.

ఏ వయస్సులో, ఎలా పరిచయం చేయాలి?
చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఏడుపు ఆపడానికి లేదా వారు అన్నం తినడానికి ఆరు నెలల వయస్సు నుండే ఫోన్‌ చూపిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం.
» రెండేళ్ల వరకు మొబైల్‌ ఫోన్‌కు పూర్తి దూరంగా ఉంచాలి. ఈ దశలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో వారికి మనుషుల స్పర్శ, మాటలు అవసరం, డిజిటల్‌ బొమ్మలు కాదు.
» రెండు నుంచి ఐదేళ్ల వరకు వారానికి రెండుసార్లు రైమ్స్‌ లేదా స్టోరీ టెల్లింగ్‌ వీడియోలు చూపించవచ్చు. అయితే, మీరు పక్కనే ఉండి వివరించాలి.
» ఆరు నుంచి పన్నెండేళ్ల వరకూ హోంవర్క్‌ హెల్ప్‌ కోసం, కొత్త స్కిల్స్‌ (కోడింగ్, డ్రాయింగ్‌) నేర్చుకోవడానికి మాత్రమే. గేమ్స్‌ అనేవి కేవలం వీకెండ్స్‌లోనే.

‘బహుమతి’గా ఇవ్వకండి..
చాలామంది తల్లిదండ్రులు పుట్టినరోజుకో లేదా క్లాసులో ఫస్ట్‌ వచ్చినందుకో స్మార్ట్‌ఫోన్‌ను ఒక రివార్డుగా ఇస్తారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల పిల్లల మెదడులో ఫోన్‌ అనేది ఒక ‘విలువైన ఆస్తి’గా ముద్రపడిపోతుంది. ఫోన్‌ కేవలం సమాచారం తెలుసుకోవడానికి, అవసరమైనప్పుడు మాట్లాడుకోవడానికి వాడే ఒక ‘టూల్‌’ మాత్రమేనని మొదటి నుంచి అర్థమయ్యేలా చెప్పాలి.

‘కో–వ్యూయింగ్‌’ పద్ధతిని పాటించండి
పిల్లలకు ఫోన్‌ ఇచ్చి మీరు వేరే పనిలోకి వెళ్ళిపోవద్దు. మొదట్లో వారు ఏం చూస్తున్నారో వారితో కలిసి చూడండి. పిల్లలు ఒంటరిగా స్క్రీన్‌ చూస్తున్నప్పుడు వారి మెదడు కేవలం ‘రిసీవింగ్‌ మోడ్‌’లో ఉంటుంది. అదే మీరు పక్కన ఉండి, ‘చూడు ఆ పిచుక ఎంత బాగుందో!’, ‘ఆ రంగు ఏంటి?’ అని అడుగుతుంటే వారి మెదడు చురుగ్గా స్పందిస్తుంది. దీనినే ‘జాయింట్‌ అటెన్షన్‌’అంటారు.

టెక్నాలజీ కాంట్రాక్ట్‌ ...
పిల్లల వయస్సు ఎనిమిదేళ్లు దాటితే, వారికి ఫోన్‌ ఇచ్చే ముందే ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అది సరదాగా ఉన్నా, నియమాలు స్పష్టంగా ఉండాలి.
» రోజుకు 30–45 నిమిషాలు మాత్రమే.
» సైన్స్ వీడియోలు, క్విజ్‌ గేమ్స్‌ మాత్రమే చూడాలి. 
» రూల్‌ అతిక్రమిస్తే, మరుసటి రోజు ఫోన్‌ ఉండదు.
ఇలా చేయడం వల్ల పిల్లల్లో ‘సెల్ఫ్‌ డిసిప్లిన్‌’ పెరుగుతుంది.

కంటెంట్‌ క్యూరేషన్‌...
సెల్‌ ఫోన్‌ పరిచయం చేసేటప్పుడు మీరు ఇన్‌స్టాల్‌ చేసే యాప్స్‌ విషయంలో జాగ్రత్త వహించండి.
» ‘ఖాన్‌ అకాడమీ కిడ్స్‌’ లేదా ‘డ్యుయోలింగో’ వంటి యాప్స్‌ ద్వారా భాషా నైపుణ్యాలను పరిచయం చేయండి.
» గూగుల్‌ ‘ఫ్యామిలీ లింక్‌’ వంటి యాప్స్‌ వాడండి. ఏది పడితే అది క్లిక్‌ చేయకుండా ఫిల్టర్లు పెట్టండి.

‘నో ఫోన్‌’ సమయాలు...
ఫోన్‌ పరిచయం చేసే తొలిరోజే.. అది ఎప్పుడు వాడకూడదో కూడా చెప్పాలి.
» బాత్రూమ్, బెడ్‌ రూమ్‌లో ఫోన్‌ అస్సలు రాకూడదు.
» భోజనం సమయంలో నో ఫోన్‌. ఫోన్‌ చూస్తూ తినడం వల్ల పిల్లలకు ఆకలి మీద నియంత్రణ ఉండదు, ఇది భవిష్యత్తులో ఈటింగ్‌ డిజార్డర్లకు దారితీస్తుంది.

డిజిటల్‌ ఎటికెట్స్‌ నేర్పండి
ఫోన్‌ అంటే కేవలం గేమ్స్‌ కాదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి? మెసేజ్‌ చేసేటప్పుడు ఎలాంటి భాష వాడాలి? ఫోటోలు తీసేటప్పుడు ఎదుటివారి అనుమతి తీసుకోవడం వంటి ‘డిజిటల్‌ లిటరసీ’ వారికి పరిచయం చేయండి.

‘రియల్‌ వరల్డ్‌’ మర్చిపోవద్దు!
పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, అంతకంటే అందమైన ప్రపంచం బయట ఉందని మర్చిపోనివ్వకండి. మట్టిలో ఆడటం, వానలో తడవటం, స్నేహితులతో గొడవపడటం.. ఇవన్నీ ఇచ్చే అనుభూతి ఏ హై–డెఫినిషన్‌ స్క్రీన్‌ ఇవ్వలేదు. అందుకే ఎక్కువ సమయం బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. పిల్లలను ఫోన్‌ నుంచి దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కాని, దానిని ‘ఆరోగ్యకరంగా’ వాడేలా మార్చవచ్చు.

-సైకాలజిస్ట్‌ విశేష్‌
- ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌
www.psyvisesh.com

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)