Breaking News

జనరల్‌ నాలెడ్జ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌

Published on Sat, 09/21/2024 - 12:11

ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్‌ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్‌ క్విజ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్‌ బచ్చన్‌ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్‌ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్‌ సర్‌తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్‌.

మయాంక్‌ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్‌ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్‌. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్‌లను అడుగుతుంటాడు. జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.

అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్‌ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్‌ పోటీలు ఉన్నప్పుడే జనరల్‌ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.
న్యూస్‌పేపర్‌ రోజూ చదవడం మరచిపోవద్దు.

‘జననరల్‌ నాలెడ్జ్‌కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్‌. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్‌ నాలెడ్జ్‌లో దిట్ట’ అనిపించుకోండి.
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)