Breaking News

న్యూ ఇయర్‌ వేడుకలు మొదటగా ప్రారంభమయ్యే దేశం ఇదే..!

Published on Sun, 12/31/2023 - 12:49

2023కి ఈ రోజుతో వీడ్కోలు చెప్పేసి కొత్త ఏడాది 2024కి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఎలా సెలబ్రెట్‌ చేసుకోవాలి, ఈ ఏడాది అంతా మంచే జరిగేలా ఏం చేయాలి  అనే ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు కూడా. ఎలాంటి చేదు అనుభవాలు, బాధలు, కన్నీళ్లు చవిచూసినా ఈ ఏడాది అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ఆశావాహ దృక్పథంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం. ఈ సందర్భంగా ఏయే దేశాలు న్యూ ఇయర్‌కి ముందుగా స్వాగతం పలుకుతాయి. టైమింగ్స్‌ ప్రకారం ఏయే దేశాల్లో ముందుగా వేడుకలు జరిపోతాయి తదితరాలు గురించి తెలుసుకుందామా!.

అందరికి న్యూ ఇయర్‌ ఒకే రోజు మొదలైనప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం జస్ట్‌ కొన్ని గంటల తేడాతో ముందుగా జరిగిపోతాయి. ప్రపంచదేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటుగా ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాంటి దేశాలు ఏవంటే..

ముందుగా సెలబ్రేట్‌ చేసుకునే దేశాలు..
ఫసిపిక్‌ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి, న్యూజిలాండ్‌, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలుకే  వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక న్యూజిలాండ్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం  నుంచే న్యూ ఇయర్‌ వేడుకలు ప్రారంభమైపోతాయి. ఇదే సమయాలనికి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. ఇక భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల మనకంటే 30 నిమిషాల ముందు కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాయి. 

చివరిగా జరుపుకునే దేశాలు..
జనావాసాలు లేని హౌలాండ్‌, బేకర్‌ దీవులలో అయితే భారత కాలమానం ‍ప్రకారం జనవరి 1, సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అంతేగాదు భారత్‌లో జరిగిన తర్వాత నాలుగున్నర గంటలకు సుమారు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాది 2024కి స్వాగతం చెబుతాయి. వాటిలో నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ, ఐరోపా దేశాల తోపాటు కాంగో అంగోలా, కామెరూన్‌ వంటి ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. భారత్‌ తర్వాత 5.30 గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. అలాగే అమెరికాలో భారత కాలమానం ‍ప్రకారం జనవరి1 ఉదయం స్వాగతం పలుకుతుంది. కాగా, భారతదేశంలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునే సమయానికే శ్రీలంక వాసులు కూడా వేడుకలు జరుకోవడం విశేషం.

(చదవండి: వీధి కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న నెటిజన్లు! ఎందుకో తెలుసా?)

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు