Breaking News

సర్విక్స్‌ వీక్‌గా ఉందని..

Published on Sun, 12/22/2024 - 11:32

నాకిప్పుడు ఆరోనెల. సర్విక్స్‌ వీక్‌గా ఉందని ఐదో నెలలో కుట్లు వేశారు. అప్పుడొక నెల లీవ్‌ తీసుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఆఫీస్‌లో జాయిన్‌ కావాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వర్క్‌ చేయొచ్చా? 
– సుమతి, వరంగల్‌

ఈ రోజుల్లో ప్రీటర్మ్‌ బర్త్‌ (నెలలు నిండకుండానే కాన్పు)ను 10 శాతం కేసెస్‌లో చూస్తున్నాం. ఇలా పుట్టిన బిడ్డలు చాలా వరకు ఏ ప్రాబ్లమ్‌ లేకుండానే ఉంటారు. అతికొద్ది మందిలో మాత్రం కొన్ని హెల్త్‌ రిస్క్స్‌ ఉంటున్నాయి. ప్రీటర్మ్‌ బర్త్‌కి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిల్లో గర్భసంచి వీక్‌గా ఉండటం, సర్విక్స్‌ లూజ్‌ అవడం, షార్ట్‌ అవడం, అర్లీగా ఓపెన్‌ అవడం లాంటివి ప్రధాన కారణాలు. ఇంతకుముందు సర్విక్స్‌కి ఏదైనా సర్జరీ జరిగినా, ముందు కాన్పు కష్టమైనా, గర్భసంచి ఆకారంలో మార్పులున్నా సర్విక్స్‌ టైమ్‌కన్నా ముందే తెరుచుకుని నెలలు నిండకుండానే కాన్పు అవుతుంది. ఇంతకుముందు నెలల నిండకుండానే కాన్పు అయితే ఈసారీ ఆ రిస్క్‌ పెరుగుతుంది. అలాంటి వారిలో రెండు వారాలకు ఒకసారి 12 వారాల నుంచి సర్వైకల్‌ లెంగ్త్‌ను చెక్‌ చేసి.. షార్ట్‌ అయితే కుట్లు వేస్తారు. 

సర్వైకల్‌ స్టిచ్‌ వేసిన ప్రతి విజిట్‌లో యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందా, సుగర్‌ లెవెల్స్‌లో ఏమైనా తేడా ఉందా అని చెక్‌ చేస్తారు. సాధారణంగా సర్వైకల్‌ స్టిచ్‌ వేసిన తర్వాత బ్లీడింగ్, కడుపు నొప్పి లాంటివేమీ లేకపోతే రెండు వారాల తర్వాత రొటీన్‌ వర్క్స్‌ చేసుకోవచ్చు. నెమ్మదిగా వాకింగ్‌ కూడా మొదలుపెట్టొచ్చు. నాలుగు వారాల్లో ఆఫీస్‌కీ వెళ్లొచ్చు. కుదిరినంత వరకు నాలుగు గంటలకు ఒకసారి 10 నుంచి 15 నిమిషాలపాటు రిలాక్స్‌ అవటానికి ట్రై చెయ్యండి. అదేపనిగా గంట కంటే ఎక్కువ నిలబడటం, దూరప్రయాణాలు చేయొద్దు. రొటీన్‌ పనిలో పడటంతో కొంతమందిలో స్ట్రెస్‌ లెవెల్స్‌ కూడా తగ్గుతాయి. బెడ్‌ రెస్ట్‌ అవసరం లేదు. బెడ్‌ రెస్ట్‌ వలన ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువ ఉన్నవారు (బీఎమ్‌ఐ 30 కంటే ఎక్కువ) చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ సర్వైకల్‌ స్టిచ్‌ డిఫికల్ట్‌ అయినా, బ్లీడింగ్‌ లేదా నొప్పి ఉన్నా, లీకేజ్‌ ఉన్నా ఆఫీస్‌కి వెళ్లకూడదని  డాక్టర్‌ చెబుతారు. 

అలాంటి పరిస్థితిలో ఇంటి నుంచే పనిచేసే ఆప్షన్‌ని తీసుకోవాలి.  మాయ కిందికి ఉన్నా, బ్లీడింగ్‌ ఉన్నా.. ఇంటర్‌ కోర్స్‌కు దూరంగా ఉండాలి. సబ్బుతో వజైనా వాష్‌ చేయకూడదు. దీని వలన నార్మల్, నేచురల్‌ బాక్టీరియా చనిపోతుంది. వజైనల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ రిస్క్‌ పెరుగుతుంది. అప్పుడు ప్రీటర్మ్‌ బర్త్‌ రిస్క్‌ కూడా ఎక్కువవుతుంది. అందుకే కేవలం వేడి నీటితో ఎక్స్‌టర్నల్‌గా మాత్రమే క్లీన్‌ చేసుకోవాలి. డైట్‌లో కూడా ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఫిష్‌ ఉండేలా చూసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. ఒమేగా –3  ఫ్యాటీ యాసిడ్స్‌ క్యాప్సూల్స్‌ కొంతవరకు హెల్ప్‌ చేస్తాయి. ఎప్పుడయినా వాటరీ వజైనల్‌ డిశ్చార్జ్‌ ఉన్నా, వజైనల్‌ బ్లీడింగ్, వజైనల్‌ ప్రెజర్‌ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నాకు ఇద్దరు పిల్లలు. నా వయసు 25 సంవత్సరాలు. వెంట వెంటనే  పిల్లలు కాకుండా కాయిల్‌ వేస్తారు అని విన్నాను. దానితో ఏవైనా సైడ్‌ ఎఫ్‌క్ట్స్‌ ఉంటాయా? నొప్పి ఉంటుందా? 
– ఎస్‌. ప్రసన్న లక్ష్మి, విజయవాడ 

టెంపరరీ లాంగ్‌టర్మ్‌ ఆప్షన్స్‌లో కాపర్‌ టీ కాయిల్, Mirena అనే రెండు కాయిల్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. చాలామందికి అవగాహన లేక అవాంఛిత గర్భాన్ని, టర్మినేషన్‌ను ఎదుర్కుంటారు. సాధారణంగా ఈ కాయిల్స్‌ను పీరియడ్స్‌ అయిపోయిన ఒక వారంలో అవుట్‌ పేషంట్‌ వార్డ్‌లో వేస్తారు. ఈ ప్రొసీజర్‌ చేసే ముందు పేయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్స్‌ ఇస్తారు. కొంచెం నొప్పి ఉంటుంది. ఒకటి రెండు రోజులు టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. కాయిల్‌ వేసిన తర్వాత ఒక వారం పాటు కొంచెం స్పాటింగ్‌ ఉంటుంది. ఈ కాయిల్‌ వల్ల నెలసరి సమయమేమీ మారదు. కొంతమందికి మొదటి రెండు, మూడు నెలల్లో రక్తస్రావం కాస్త ఎక్కువవొచ్చు. కంగారుపడాల్సిన అవసరం లేదు. దానంతట అదే సర్దుకుంటుంది. Mirena అనేది హర్మోన్‌ కాంట్రసెప్టివ్‌ కాయిల్‌.

 దీన్ని.. క్రమం తప్పుతూ, అధిక రక్తస్రావంతో కూడిన నెలసరి ఉన్నవారికి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ లేనివారికి సూచిస్తారు. ఈ కాయిల్‌ వల్ల అధిక రక్తస్రావం తగ్గుతుంది. అయితే ఇర్రెగ్యులర్‌ స్పాటింగ్‌ ఉండొచ్చు. ఈ రెండు కాయిల్స్‌ 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేస్తాయి. గడువైపోతున్నప్పుడు మార్పించుకోవాలి. ఏ కాయిల్‌ వేసినా అది 3 నుంచి 6 నెలల్లో అడ్జస్ట్‌ అవుతుంది. సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. ఈ కాయిల్‌ వేసినప్పుడు, సర్విక్స్‌ దగ్గర చిన్న థ్రెడ్‌ లాంటిది ఉంటుంది. కాయిల్‌ గడువైపోయాక దాన్ని తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతినెలా దీన్ని చెక్‌ చేసుకోవచ్చు. 

కాయిల్‌ వేసిన తర్వాత ఒక నెల వరకు కండోమ్స్‌ని వాడాలి. కాయిల్‌ వేసిన వారం తర్వాత కూడా నొప్పి ఉన్నా, జ్వరం, చిల్స్‌ వచ్చినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. కాయిల్‌ వేసిన కొన్ని నెలల తర్వాత కాయిల్‌ థ్రెడ్‌ తగలకపోయినా డాక్టర్‌ని సంప్రదించి, కాయిల్‌ సరైన ప్లేస్‌లోనే ఉందా.. లేదా అని చెక్‌ చేయించుకోవాలి. కాయిల్‌ వేసే ముందు పాప్‌ స్మియర్‌ అనే సర్వైకల్‌ ఇన్‌ఫెక్షన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ టెస్ట్‌ చేయించుకొని, రిపోర్ట్స్‌ నార్మల్‌ అని వస్తేనే వేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి రొటీన్‌ చెకప్స్‌ చేయించుకుంటూ ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉందా.. ఇతర సైడ్‌ఎఫ్‌క్ట్స్‌ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి.

డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)