పింక్‌ ట్యాక్స్‌ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!

Published on Wed, 04/02/2025 - 10:28

పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్‌ క్లియర్‌! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!

కేవలం ప్యాకింగ్‌లో తేడా వల్ల పర్సనల్‌ హైజీన్, స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్‌ టాక్స్‌ అంటున్నారు.  ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్‌ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా  చెల్లిస్తున్నారట. కేవలం పింక్‌ ప్యాక్‌లో ఉన్నందున రేజర్‌ బ్లేడ్స్‌ మీద 29 శాతం, బాడీ వాష్‌ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట. 

ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజూందార్‌ షా కూడా స్పందించారు. ‘పింక్‌ టాక్స్‌ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్‌ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. 

పింక్‌ టాక్స్‌ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్‌లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్‌ ఈక్వాలిటీని ప్రమోట్‌ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్‌ టాక్స్‌ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14.. రైట్‌ టు ఈక్వాలిటీ కింద కోర్ట్‌లో దావా వేయొచ్చు. 
 

 

(చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?)

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)