Breaking News

పద్మవ్యూహం అంటే..?

Published on Mon, 03/16/2026 - 02:17

ఎవరైనా తీవ్రసమస్యలు, కష్టాల్లో చిక్కుకుంటే వాళ్ళు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అంటుంటాం. అలనాటి ద్వాపర యుగంలో 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 13 వ రోజున కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని అమలు పరిచాడు. ఈ వ్యూహం చూసేందుకు పద్మం, చక్రం ఆకారంలో ఉండటంతో దీనిని పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం అని కూడా అంటారు. మొత్తం కౌరవ సైన్యాన్ని తామరపువ్వు ఆకారంలో ఉండేలా ఏడు వలయాలలో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యంగా పద్మవ్యూహాన్ని ద్రోణచార్యుడు ఏర్పాటు చేశారు. ఈ పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతుచిక్కనిదిగా ఉంటుంది. సామాన్యుడెవరూ, ఈ వ్యూహంలోకి వెళ్ళలేరు.

ఒకవేళ వెళ్లినా మృత్యువలయానికి దగ్గరవుతూ, సజీవంగా తిరిగి రాలేరు. అందుకే అతి పరాక్రమ వంతుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడే కానీ, తిరిగి రాలేక అమరుడయ్యాడు. ఈ వ్యూహాన్ని పాండవుల తరఫున ఛేదించగలిగిన వారు కేవలం శ్రీ కృష్ణుడు, అర్జునుడు, శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు, అర్జునుని కుమారుడైన అభిమన్యుడు మాత్రమే. అయితే శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కానీ, వెనుకకు వచ్చే విద్య తెలియకపోవడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు వీరమరణం పొండాడు. కేవలం శ్రీ కృష్ణుడు అర్జునుడు మాత్రమే ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన యోధులు. ఇక కౌరవుల తరఫున భీçష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామలు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించ గలిగినవారు.

పద్మవ్యూహ నిర్మాణం ఇలా....
కురుక్షేత్ర మహా సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారు. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, మరో 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతి దళాలు కలిపి 2,18,700 మంది మొత్తం సైన్యం ఉంటారు. దీనిని 18తో హెచ్చవేస్తే 39,36,600 మంది సైన్యం పాల్గొంటారు. సుమారుగా పద్మవ్యూహం విస్తీర్ణం 5,929 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు.

పద్మ వ్యూహంలో ఎవరెవరు ఏయే స్థానాల్లో...
కౌరవసేనలను తామరపూవు ఆకారంలో నిలిపిన ద్రోణుడు అలనాటి వివిధ దేశాధిపతులను తామరపూవులోని రేకుల మాదిరిగా నిలిపాడు. వారి కుమారులను పూవు మధ్యభాగంలోని కేసరాలుగా నిలబెట్టాడు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపల భాగంలో, వారి మధ్య దుర్యోధనుడు సైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు ఇతర స్థానాల్లో నిలిచారు.  – సి.ఎన్‌.మూర్తి, పాత్రికేయులు

Videos

సునీత సంచలన ఆడియో బయటపెట్టిన వైఎస్ అవినాష్ రెడ్డి

రాజశేఖర్ ను వివేకా హత్యకు ముందు రోజున ఎందుకు కాణిపాకం పంపించారు

SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ

పుట్టాపై సీరియస్... BR నాయుడుపై మాత్రం నో సీరియస్... జడ శ్రవణ్ సెటైర్లు

అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భేటీ

తెలంగాణలో IAS-IPSల కొరత

టీడీపీ ఎంపీ పుట్టా సోషల్ మీడియాలో ఆడుకున్న నెటిజన్లు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై BJYM కార్యకర్తలు దాడి

UAEలోని అతిపెద్ద ఇంధన నిల్వ కేంద్రంపై ఇరాన్ బాంబుల వర్షం

Photos

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)