Breaking News

పండంటి కాపురానికి ఏడడుగులు!

Published on Sun, 02/25/2024 - 16:08

పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు. 

ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్‌ జాన్‌ గాట్‌మన్, నాన్‌ సిల్వర్‌..  వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. 

1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం
పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది. 

  • మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం?
  • వారి అతిపెద్ద భయం ఏమిటి?
  • భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి?
  • వారు దేనికి ఒత్తిడి చెందుతారు? 
  • వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి?
  • ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 

2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి
వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం. 
బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు.. 

  • కలసి గడపడానికి ప్లాన్‌ చేయలి
  • ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి
  • భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి
  • భాగస్వామిని అభినందించాలి
  • అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్‌ థెరపీకి వెళ్లాలి

3. కలసి మెలసి నడవండి
ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్‌ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్‌ కనెక్షన్‌ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది. 

4. భాగస్వామి మాటకు విలువనివ్వండి
దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 

5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి
వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు. 

  • ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి
  • అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి
  • ఒకరి తప్పులను ఒకరు సహించాలి

6. పీటముడిని అధిగమించండి
నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి.. 

  • సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
  • ప్రశాంతంగా కమ్యూనికేట్‌ చేయాలి ·
  • చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి 
  • భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి 

7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి
జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.

  • మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం
  • పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం
  • అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం
  • అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం  

--సైకాలజిస్ట్‌ విశేష్‌ 
psy.vishesh@gmail.com 

(చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..)

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)