Breaking News

నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?హైపోనాట్రేమియా వస్తుంది జాగ్రత్త!

Published on Tue, 08/22/2023 - 16:11

నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందుకే రోజూ వీలైంత ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మంచినీళ్లు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్‌ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మరి ఒక మనిషి రోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? అతిగా నీళ్లు తాగితే వచ్చే ఇబ్బందులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. 

అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం కావాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే, నీళ్లు మన శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడుతుంది. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే మంచిది కదా అని అతిగా నీళ్లు తాగడం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం​ మంచిది కాదు. అతిగా నీళ్లు తాగడం వల్ల మెదడపు ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే నీళ్లు తీసుకోవాలి. 

హైపోనాట్రేమియా ఏర్పడి.. మరణానికి కూడా

అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగితే మంచిది. కానీ కొందరు కావాలని బలవంతంగా ఎక్కువగా నీళ్లు తీసుకుంటారు. దీని వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. ఇది ఎక్కువైతే, మెదడు వాపు,కోమాలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది. 

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?

మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు దాహం ద్వారా అది మనకు తెలుస్తుంది. అప్పుడు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. చాలామంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నీరు చాలా త్వరగా శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీళ్లు తాగడానికి ప్రయత్నించడం. మరీ చల్లని, మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 3-4 లీటర్ల నీరు సరిపోతుంది. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)