Breaking News

గాయిటర్‌ అంటే...? లక్షణాలు, చికిత్స!

Published on Tue, 12/17/2024 - 09:52

మన శరీరంలో అనేక గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులలో థైరాయిడ్‌ గ్రంథి చాలా కీలకమైనది.  మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉండే ఈ గ్రంథి థైరాయిడ్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది. కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. ఇలా థైరాయిడ్‌ గ్రంథి అసాధారణమైన సైజుకు  పెరగడాన్ని ‘గాయిటర్‌’ అంటారు. 

గాయిటర్‌ రకాలు... 
ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫ్యూస్‌ గాయిటర్, రెండోది నాడ్యులార్‌ గాయిటర్‌. సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బిపోయి ఇరువైపులా సమానంగా పెరగడాన్ని ‘డిఫ్యూస్‌ గాయిటర్‌’గా పరిగణిస్తారు. ఇక రెండోది ‘నాడ్యులార్‌ గాయిటర్‌’. ఈ నాడ్యులార్‌ గాయిటర్‌లో థైరాయిడ్‌ గ్రంథిలోని ఏదైనా ఒక భాగంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. థైరాయిడ్‌ గ్రంథిలో ఇలా గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్‌ గాయిటర్‌ అంటారు. 

గాయిటర్‌ సమస్య వచ్చిన కొంతమందిలో సాధారణంగా థైరాయిడ్‌ హార్మోన్ల ఉత్పత్తిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. కానీ మరికొందరిలో మాత్రం థైరాయిడ్‌ హార్మోన్లు ఎక్కువగా గానీ లేదా తక్కువ మోతాదులోగానీ ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ హార్మోన్ల ఉత్పత్తి మోతాదులు పెరిగితే దాన్ని ‘హైపర్‌ థైరాయిడిజం’ అనీ, తగ్గితే ‘హైపోథైరాయిడిజమ్‌’ అని అంటారు. హైపర్‌ థైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం పెరగడంతో బాధితులు సన్నబారిపోవడం, హైపో థైరాయిడిజమ్‌లో జీవక్రియలు మందగించడంతో బాధితులు లావెక్కడం అనే ప్రధాన లక్షణాలతో  పాటు మరికొన్ని సమస్యలు కనిపిస్తాయి. 

నిర్ధారణ పరీక్షలు... 
గొంతు దగ్గర బాగా ఉబ్బి కనిపించడం అనే పైకి కనిపించే లక్షణంతో దీన్ని కొంతవరకు నిర్ధారణ చేసినప్పటికీ... పూర్తి నిర్ధారణ కోసం థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, అల్ట్రాస్కాన్, ఎఫ్‌ఎన్‌ఏసీ వంటివి అవసరమవుతాయి.  

చికిత్స...
థైరాయిడ్‌ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్‌ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్‌ ఆధ్వర్యంలో తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో థైరాయిడ్‌ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో థైరాయిడ్‌ గ్రంథి వాపు (గాయిటర్‌) తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇలాంటి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 
 

డా. వ్రిందా అగర్వాల్‌ కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)