Breaking News

Cimate Change : అడాప్టేషన్‌

Published on Wed, 12/18/2024 - 14:44

ప్రకృతి వైపరిత్యాలు, సముద్ర నీటిమట్టం పెరుగుదల, జీవవైవిధ్యం క్షీణత, ఆహార – నీటి అభద్రత వంటి వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తిని పెంపొందించే రక్షక చర్యలనే అడాప్టేషన్‌ అంటారు. 

వాతావరణ మార్పుల నష్టాన్ని సాధ్యమైనంత వరకు స్థానిక స్థాయిలో అమలు చేయాలినవి అడాప్టేషన్‌ చర్యలు. అంటే, అడాప్టేషన్‌ చర్యలను అమలుపరచటంలో గ్రామీణ ప్రజలు, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కీలక  పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వంటి పునరుజ్జీవన వ్యవసాయ పద్ధతులను అనుసరించటం.. కరువును తట్టుకునే వంగడాలను సాగు చేయటం.. నీటి నిల్వ – వినియోగ పద్ధతులను మెరుగుపరచటం.. అడవులు తగులబడకుండా అడ్డుకునే రీతిలో భూముల నిర్వహణ చర్యలు చేపట్టడం.. వరదలు, వడగాడ్పులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థలను నిర్మించటం.. ఇవన్నీ అడాప్టేషన్‌ చర్యలే. 

అయితే, స్థానికంగా చర్యలు తీసుకుంటే అడాప్టేషన్‌ పూర్తి కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గించుకునేందుకు దారితీసే విధానాల రూపకల్పనతో  పాటు ప్రభుత్వాలు అనేక భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సముద్ర నీటి మట్టాలు పెరగటం వల్ల దెబ్బతిన్న కోస్తా  ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం లేదా వేరే సురక్షిత ప్రాంతానికి తరలించటం.. మరింత తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నా తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయటం.. ప్రకృతి వైపరిత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థలను విస్తరింపజేసి వైపరిత్యాల సమాచారాన్ని అందుబాటులోకి తేవటం.. ప్రత్యేకించి వాతావరణ మార్పులకు సంబంధించిన నష్టాలను పూచ్చేందుకు బీమా సదుపాయాలను అభివృద్ధి చేయటం..  ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలకు, వన్యప్రాణులకు సరికొత్త రక్షణ చర్యలు చేపట్టం.. ఇవన్నీ క్లైమెట్‌ ఛేంజ్‌ అడాప్టేషన్‌ చర్యలే! 

ఇదీ చదవండి :  తాతగారి సెన్సేషనల్‌ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)