Breaking News

వెయిట్‌ ట్రయినింగ్‌ బ్రెయిన్‌కూ బెటరే

Published on Sat, 01/24/2026 - 05:51

కండరాల బలం కోసం స్ట్రెంత్‌ ట్రయినింగ్‌ లేదా వెయిట్‌ ట్రయినింగ్‌ తప్పనిసరి అనే విషయం చాలాసార్లు వినే ఉంటాం. అయితే స్ట్రెంత్‌ ట్రయినింగ్‌ అనేది మజిల్‌ లాస్‌ను రివర్స్‌ చేయడమే కాదు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని, వయసు పెరిగినా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. ఈ అధ్యయనాన్ని వాషింగ్టన్‌ యూనివర్శిటీలోని ఓ పరిశోధక బృందం నిర్వహించింది.

1,164 మందిపై...
యాభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 1,164 మంది స్త్రీ, పురుషులపై వాషింగ్టన్‌ పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కి వారానికి రెండుసార్లు వెయిట్‌ ట్రయినింగ్‌ చేయడం అలవాటు. రెండో గ్రూప్‌నకు ఈ అలవాటు లేదు, మొదటి గ్రూపు వారు జ్ఞాపకశక్తి పరీక్షలో మెరుగ్గా రాణించారు. వెయిట్‌ ట్రయినింగ్‌ చేయని వారితో పోల్చితే చేసేవారు ఆరోగ్యకరమైన మెదడు న్యూరాన్‌లను కలిగి ఉన్నారు.

స్ట్రెంత్‌ ట్రయినింగ్‌ అంటే?
డంబెల్స్, బార్బెల్స్, ఒక మోస్తరు బరువులు, రెసిస్టెంట్‌ బ్యాండ్, బాడీ వెయిట్‌ 
(ఉదా: పుషప్‌లు), వాటర్‌బాటిల్స్, బ్రిక్స్‌తో చేసే వ్యాయామం.

మతిమరుపునకు దూరంగా...
వెయిట్‌ ట్రయినింగ్‌ అనేది మెదడు ఆరోగ్యాన్ని మెరుగు
పరచడానికి వివిధ న్యూరోప్రొటెక్టివ్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలను ఉత్పత్తి చేస్తుందని, డిమెన్షియా (మతిమరుపు)ను దూరం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

ఉపయోగాలు
మెదడుపై వెయిట్‌ ట్రయినింగ్‌ ఏ రకంగా ప్రభావం చూపుతుందంటే...
ఏకాగ్రతను పెంచుతుంది
జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది
ఒత్తిడిని తగ్గిస్తుంది
నాడుల రక్షణకు ఉపయోగపడుతుంది 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)