Breaking News

జుట్టు రాలిపోతోందా? డోంట్‌ వర్రీ..టీ వాటర్‌తో ఇలా చేస్తే..!

Published on Sat, 01/11/2025 - 16:50

Tea Water for Hair:  జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు  రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా,  చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం.  ఇది  అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను  ఎంచుకోవడం మంచిది. 

అలాంటి వాటిట్లో ఒకటి  టీ నీటితో  జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో  చూద్దాం.


టీ  వాటర్‌ ఎలా తయారు చేయాలి
హెయిర్‌ వాష్‌  కోసం టీ వాటర్‌ ను తయారు  చేయడం చాలా సులభం

కావాల్సిన పదార్థాలు:
2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)
2–3 కప్పుల నీరు
కావాలంటే ఇందులో 
లావెండర్ లేదా రోజ్‌మేరీ ఆయిల్‌ కూడా కలుపుకోవచ్చు.

 ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?

  • నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.
  • ఇందులో కొద్దిగా లావెండర్‌, రోజ్‌మేరీ ఆయిల్‌ చుక్కలు  కలపాలి.
  • చల్లారిన తరువాత  టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్‌లో పోసుకోవాలి.
  • ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో   జుట్టును శుభ్రంగా  వాష్‌ చేయాలి.
  • షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి.  
  • తర్వాత 5–10 నిమిషాలు పాటు  చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.
  • 15-20  నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.

ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో

ప్రయోజనాలు 

  • జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది. 
  • జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
  • మాడు ఆరోగ్యానికి కూడా మంచిది.  చుండ్రు, దురద లాంటి  సమస్యలు తగ్గుతాయి. 
  • టీ వాటర్ జుట్టు క్యూటికల్‌ను మూసివేస్తుంది.కెఫిన్  కారణంగా   రక్త ప్రసరణ బాగా  జరిగిన  జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. 
  • హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
  • డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి.  కనుక ఈ ప్రక్రియ చాలామంచిది.
  •   జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.

ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్‌ గ్లో కోసం ఇలా చేయండి!

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)