Breaking News

అక్కడ సామాజిక కట్టుబాట్లపై సాధించిన విజయానికి గుర్తుగా హోలీ!

Published on Mon, 03/25/2024 - 18:03

మన భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ పలు పండుగలను జరుపుకోనివ్వకుండా నిషేధాలు ఉండేవి. వారు నలుగురుతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకోకూడదు. కనీసం చూడటానికి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే నాలుగు గోడల మధ్యనే బంధించేసేవారు. వారికి కావాల్సినవి తీసుకొచ్చి వారి గది బయటపెడితే తీసుకోవాలి అంతే. ఎవ్వరికీ కనిపించను కూడా కనిపంచకూడదు. అంత దారుణమైన గడ్డు పరిస్థితుల్లో జీవించేవారు నాటి వితంతువులు. ఇప్పుడిప్పుడే కొంచె వారిని మంచిగానే చూస్తున్నా..కొన్ని విషయాల్లో వారి పట్ల అమానుషంగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఇలాంటి హోలీ పర్వదినం రోజున బయటకు అస్సలు రాకూడదు, రంగులు జల్లుకోకూడదట. వారికోసం ఓ ఎన్జీవో ముందుకోచ్చి సుప్రీం కోర్టులో పోరాడి మరీ వారు కూడా సెలబ్రేట్‌ చేసుకునేలా చేసింది. ఈ కథ ఎక్కడ జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోlr వింతతు స్త్రీలను మాత్రం రంగుల హోలీలో పాల్గొనిచ్చేవారు కాదు. అస్సలు వారు సెలబ్రేట్‌ చేసుకోకూడదని నిషేధం విధించారు అక్కడి పెద్దలు. తెల్లటి చీరతో ఉండేవారికి సంతోషానికి ప్రతీకలైన రంగులను ముట్టకూదని కట్టుదిట్టమైన ఆంక్షాలు ఉండేవి. పితృస్వామ్య నిబంధనలు గట్టిగా రాజ్యమేలుతున్న ఆ  బృందావన్‌లో వారి స్థితి అత్యంత కడు దయనీయంగా ఉండేది. వారి జీవితాలలో వెలుగు నింపేందుకు ఎన్జీవ్‌ సులభ్‌ ఇంటర్నేషన్‌ల అనే స్వచ్ఛంద సంస్థ మార్పుకు నాంది పలికింది. ఆ ఎన్జీవో మహిళా సాధికారత, సామాజిక సమ్మేళనం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.

ఆ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి నిబంధనలను తొలగించి వారుకూడా అందరిలా పండుగలను చేసుకునేలా చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించి మరీ వారికి సామాజిక కట్టుబాట్ల నుంచి విముక్తి కలిగించింది. అయినప్పటికీ ఆ వితంతువులు పండుగ చేసుకోవడం చాలా సవాలుగా ఉండేది. సరిగ్గా 2012 నుంచి వారంతా కూడా ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవడం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచే ప్రతి ఏటా ఈ హోలీ రోజున వారంతా కృష్ణుని సమక్షంలో ఆడి పాడి వేడుకగా చేసుకుంటున్నారు.

అంతేగాదు ఈ ఒక్క పండుగే గాక దీపావళి వంటి ఇతర అన్ని పండుగలు చేసుకునేలా స్వేచ్ఛను పొందారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పండుగలకు దూరమై ఉన్న ఆ వితంతువులను ధైర్యంగా అడుగు వేసి, తాము సాటి మనుషులమే ఇది తమ హక్కు అని వారికి గుర్తు చేసింది ఆ స్వచ్ఛంద సంస్థ. ఆ వితంతువులు ఈ హోలీని స్త్రీ ద్వేషం, పితృస్వామ్య నిబంధనలపై విజయం సాధించి, పొందిన స్వేచ్ఛకు గుర్తుగా సంతోషభరితంగా చేసుకుంటారు ఆ వితంతువులు. చెప్పాలంటే ఇది అసలైన హోలీ వేడుక అని చెప్పొచ్చు కథ!

(చదవండి: రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?)

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు