Breaking News

విటమిన్‌–డి లోపిస్తే మానసిక వ్యాధుల ముప్పు

Published on Mon, 06/02/2025 - 09:22

న్యూఢిల్లీ: మనుషుల ఆరోగ్యానికి విటమిన్‌–డి ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రధానంగా అప్పుడే పుట్టిన శిశువుల్లో ఈ విటమిన్‌ తగినంతగా లేకపోతే వారిలో మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అ్రస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్, డెన్మార్క్‌లోని అర్హాస్‌ యూనివర్సిటీ, స్టేట్‌ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి లాన్సెట్‌ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. 

ఈ వివరాలను సైకియాట్రీ పత్రికలో ప్రచురించారు. డి విటమిన్‌ లోపంతో జన్మించే శిశువుల్లో ఆటిజం, అటెన్షన్‌ డెఫిషిట్‌–హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ), స్కిజోఫ్రినియా వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. విటమిన్‌–డి, మానసిక సమస్యల మధ్య సంబంధాల విషయంలో ఎక్కువ మందిపై నిర్వహించిన సర్వే ఇదే కావడం గమనార్హం. సర్వేలో భాగంగా 71,000 మందిని పరీక్షించారు. వారి డి విటమిన్‌ స్థాయిలను అధ్యయనం చేశారు. వీరిలో చాలామంది బాల్యంలో మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారే.

  • శరీరంలో తగినంత డి విటమిన్‌ స్థాయిలు లేకుండా జని్మంచినవారిలో ఆరు రకాల మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు క్వీన్స్‌లాండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధి జాన్‌ మెక్‌గ్రాత్‌ చెప్పారు. మేజర్‌ డిప్రెసివ్‌ డిజార్డర్, బైపోలార్‌ డిజార్డర్, స్కిజోఫ్రినియా, ఏడీహెచ్‌డీ, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్‌(ఏఎస్‌డీ), అనొరెక్సియా నెర్వోసా వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు వివరించారు.  

  • శిశువులు, చిన్నారుల్లో డి విటమిన్‌ తక్కువగా ఉంటే స్కిజోఫ్రినియా, ఏఎస్‌డీ, ఏడీహెచ్‌డీ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు.  

  • మహిళలు గర్భంతో ఉన్నప్పుడు డి విటమిన్‌ మాత్రలు తీసుకుంటే పుట్టే శిశువులకు ముప్పు తగ్గుతుందని సూచించారు. అలాగే పుట్టిన శిశువులకు తగినంత డి విటమిన్‌ అందేలా చూడాలని చెప్పారు.  

  •  శిశువుల్లో మెదడు అభివృద్ధికి విటమిన్‌–డి అత్య ంత కీలకమని జాన్‌ మెక్‌గ్రాత్‌ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భిణుల్లో విటమిన్‌–డి స్థా యిలు తక్కువగా ఉండడం సర్వసాధారణంగా మారిపోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు.  

  • పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణులు తగినంత డి విటమిన్‌ తీసుకోవాలని డాక్టర్‌ హిమానీ నరులా ఖన్నా చెప్పారు. నిత్యం 600 నుంచి 2,000 ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌(ఐయూ) డి విటమన్‌ తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహాతో 4,000 ఐయూ వరకు తీసుకోవచ్చని వివరించారు.  

  •  శరీరంపై 10 నుంచి 30 నిమిషాలపాటు సూర్యకాంతి పడేలా చూసుకోవాలని పేర్కొన్నారు.  

  • చేపలు, గుడ్లతోపాటు పాల ఉత్పత్తుల్లో విటమిన్‌–డి అధికంగా ఉంటుంది. గర్భిణులకు కేవలం ఆహారంతోనే తగినంత విట మిన్‌–డి లభించకపోవచ్చు. అందుకే మా త్రల రూపంలో అదనంగా తీసుకోవాలని డాక్టర్‌ హిమానీ నరులా ఖన్నా చెప్పారు.  

  • పేద, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో డి విటమిన్‌ లోపం అధికంగా కనిపిస్తోంది. విటమిన్‌ సప్లిమెంట్స్‌ కూడా అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ఖరీదు భారీగా ఉండడం ప్రజలకు సమస్యగా మారింది.  

  • ధనిక దేశాల్లోనూ డి విటమిన్‌ లోపంతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఎండలోకి వెళ్లకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం ఇందుకు కారణాలు.  

  • శిశువుల్లో ఆటిజం, ఏడీహెచ్‌డీ, స్కిజోఫ్రినియా లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి  గర్భిణులు తగినంత విటమిన్‌ తీసుకుంటే శిశువులకు తగ్గుతున్న రిస్క్‌   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)