Breaking News

అలా రిటైర్మెంట్‌ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్‌!

Published on Tue, 05/13/2025 - 17:43

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన  మరునాడే టీమిండియా స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ ,తన సతీమణి బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కశర్మతో కలిసి  ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్‌ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్‌ మహారాజ్‌ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో  ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కలవడం ఇది రెండోసారి కావడం విశేషం.  దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగామారాయి. 

సతీ సమేతంగా తమ అభిమాన ఆధ్యాత్మిక గమ్యస్థానమైన బృందావనానికి చేరుకున్నారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌తో కొన్ని  సుదీర్ఘ ఆధ్యాత్మిక  ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు.  ఆ తరువాత  కోహ్లీ, అనుష్క దంపతులు సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నారు.

 కెల్లీ కుంజ్ ఆశ్రమానికి చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో  వీరి వీడియో అప్‌లోడ్‌ అయింది. ఈ సందర్భంగా  అనుష్క శర్మ  కోరుకున్నది  జరగాలంటే ఎలాంటి మంత్రాన్ని జపించాలని  ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను  అని అడిగారు. దీనికి మహారాజ్ స్పందిస్తూ, అది పూర్తిగా సాధించదగినదని సాంఖ్య యోగం, అష్టాంగ యోగం , కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చానని, ఇది తన వ్యక్తిగత అనుభవమని  చెప్పుకొచ్చారు.  అయితే,  వ్యక్తిఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆయన(దేవుడు) కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతికి మార్గాన్ని చూపించేవాడు ప్రభువు అని  వెల్లడించారు.

 

"ఒకరి కీర్తి , కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది... దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి."

అనుష్క   బ్లాక్‌ ప్రింట్ ఉన్న తెల్లటి సూట్-సెట్ ధరించగా, విరాట్ ఆలివ్ గ్రీన్ ప్యాంటుతో జత చేసిన సేజ్ గ్రీన్ షర్ట్ ధరించాడు. ఈ జంట గతంలో 2025 జనవరిలో ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించారు. మాజీ కెప్టెన్ కోహ్లీ సోమవారం టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు