Breaking News

వినాయక పందిళ్లలో సందడి చేసే మగువలూ.. మీకోసమే ఈ చిట్కాలు

Published on Sat, 09/07/2024 - 16:54

వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో  మునిగిపోతారు..భక్తులు. గణేష్‌ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్‌ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే  విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు.  భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.  మగువలంతా  శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్‌, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా  శ్రద్ధ  పెట్టాలి.   మరి అదెలాగో చూసేద్దాం.

ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్‌, స్క్రబ్‌లను  ప్రయత్నించాలి.

ఓట్స్‌- పెరుగు
టీ స్పూన్‌ ఓట్స్‌ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి.  ఆ తరువాత బాగా  రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. 

టొమాటో  స్క్రబ్‌
బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్‌ చేసుకోవాలి.  కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్‌ క్యూబ్‌తో మృదువుగా మసాజ్‌ చేసి, మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్‌ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్‌ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా  సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.

శనగపిండి, పెరుగు,పసుపు 
శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి.  పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌  సహజ బ్లీచింగ్‌ లాగా పని చేస్తుంది.

కీరదోసకాయ 

కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్‌ చేసుకోవాలి.  కీర దోసకాయలలో ఉండే విటమిన్‌ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్‌ ని కంట్రోల్‌  చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్‌  లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

కాఫీ పౌడర్‌
ఫిల్టర్‌  కాఫీ పౌడర్‌లో చక్కెర కలిపి మసాజ్‌ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్‌స్టెంట్‌  గ్లో వస్తుంది.  చందమామలా మెరిసిపోతారు.
 

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు