Breaking News

నాన్నే... దేవర ఆయనే కొండ!

Published on Sun, 06/21/2026 - 06:08

నేడు ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా ఆనంద్‌ దేవరకొండ తన తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘ఆయన దేవుడిలాంటివాడు... మాకు కొండంత అండ’ అన్నట్లుగా చెప్పారు. ‘ఆయనే దేవర... ఆయనే కొండ’ అనే తరహాలో తన తండ్రి గురించి ఈ హీరో చెప్పిన విశేషాల్లో ఆసక్తికరమైనవి.

‘తప్పు చేస్తేనే ఒప్పు ఏంటో తెలుస్తుంది’... తన పిల్లలకు గోవర్ధన్‌ రావు దేవరకొండ ఇచ్చిన స్వేచ్ఛ ఇది. విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ఇద్దరూ తండ్రి చెప్పిన మాటలు వింటూ జీవితాన్ని నేర్చుకున్నారు. విజయ్‌ దేవరకొండ ‘సెన్సేషనల్‌ స్టార్‌’, విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ‘స్పేస్‌’ సృష్టించుకున్న స్టార్‌ ఆనంద్‌ దేవరకొండ. 

→ నాన్నతో ఫ్రెండ్‌షిప్‌
చిన్నప్పటి నుంచే... అంటే నా ఫస్ట్‌ స్టాండర్డ్‌ నుంచే నేను రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివాను. మా తల్లిదండ్రులు నెలకు ఒకటి లేదా రెండుసార్లు చూడ్డానికి వచ్చేవారు. సో... హాస్టల్‌లో గడిపిన ఆ పది నెలల సమయంలో మా అమ్మానాన్న వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించేది. అందుకే వేసవి సెలవుల్లో వారితో పూర్తిగా గడిపేవాడిని. అది ఎంతో విలువైన సమయం. ఆ సమయంలోనే స్నేహంలాంటి అనుబంధం బలపడింది. అలా మా నాన్నతో నా ఫ్రెండ్‌షిప్‌ మొదలైంది. 

మా ఇంటి ముందు క్రికెట్‌ ఆడిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఉదయం 7 గంటలకు నాన్నను లేపేవాణ్ణి. నేను బ్యాటింగ్‌ చేస్తుంటే ఆయన గంటల తరబడి బౌలింగ్‌ చేసేవారు. నా జీవితంలో ఒక దశలో నేనేం చేయాలనుకుంటున్నాననే విషయంపై నాకు స్పష్టత లేదు. అప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, తమ సామర్థ్యానికి మించిన మొత్తాన్ని సమకూర్చి మాస్టర్స్‌ చదవడానికి నన్ను అమెరికా పంపించారు. ఆ అనుభవాలు, అక్కడ గడిపిన కాలం నన్ను వ్యక్తిగా పూర్తిగా మార్చేశాయని నేను నమ్ముతాను.

→ కొండంత ధైర్యం
మా నాన్న అన్ని విషయాల్లోనూ నాకు కొండంత ధైర్యం ఇస్తుంటారు. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. అవసరమైనప్పుడు తన సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లొచ్చనే నమ్మకాన్ని ఇచ్చారు. మా నాన్న ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి. ‘విజయాన్ని కాకుండా ఎదుగుదలను లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని ఆయన చెప్పిన మాటలు మా మనసులో నాటుకుపోయాయి. చిన్నప్పటి నుంచే మేము తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చారు. నేను, నా అన్న తప్పులు చేసినందుకు ఎప్పుడూ శిక్ష పడలేదు. కానీ ఆ తప్పు గురించి మా నాన్న మాతో మాట్లాడేవారు. ఆ మాటలు మమ్మల్ని బాగా ప్రభావితం చేసేవి. దాంతో ఎలాంటి సవాళ్లనైనా, ఎదురు దెబ్బలనైనా ఎలా అధిగమించాలనే విషయంలో మాకు అవగాహన వచ్చింది. మామూలుగా నాన్నంటే భయం ఉండటం సహజం. అయితే మా ఇద్దరిలో ఎవరికీ ఆయనంటే భయం లేదు. నాన్నపై అపారమైన గౌరవం, ప్రేమ మాత్రమే ఉన్నాయి.

→ మా నాన్న మంచి విశ్లేషకుడు
మా వర్క్‌ గురించి, సినిమా ఎడిట్స్‌ గురించి తరచూ మాట్లాడుకుంటుంటాం. ఒక సినిమా ఎలా వర్కవుట్‌ అవుతుంది? వర్కవుట్‌ కాదనే విషయాలను అంచనా వేయడంలో మా నాన్నకు మంచి అవగాహన ఉంది. అందుకే సినిమా ఎడిటింగ్‌ దశలో ఉన్నప్పుడు ఆయన అభి్రపాయాన్ని, విశ్లేషణను తప్పకుండా అడుగుతుంటాను.

→ పెద్ద హగ్‌
తల్లిదండ్రుల ప్రేమకు వెలకట్టలేం. వారు కనబరిచే ప్రేమకు ఏం చేసినా తక్కువే. మా నాన్న ఎంతో ఇష్టపడే ‘ఫార్మ్‌’ని, మా విలేజ్‌లో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నా ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. డబ్బుతో కొనిచ్చే బహుమతులకన్నా ప్రేమతో ఇచ్చే ‘హగ్‌’ చాలా పెద్దది. అందుకే ఈ ఫాదర్స్‌ డేకి మా నాన్నకు ఒక పెద్ద హగ్‌ రూపంలో బహుమతి ఇవ్వబోతున్నాను. అలాగే ఈ ఏడాది చివర్లో కుటుంబంతో కలిసి ఒక ట్రిప్‌ ΄్లాన్‌ చేయాలనుకుంటున్నాను. 

ఆ విషయంలోఆయనే స్ఫూర్తి
మా ఇంట్లో అందరం ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తాం. మా నాన్న కాస్త ఎక్కువ. నేను, అన్న ఏం చెప్పకుండానే తన వ్యాయామం, ఆహారం, జీవనశైలిని ఎంతో క్రమశిక్షణతో పాటి స్తారు. ఈ విషయంలోనూ ఆయన మాకు స్ఫూర్తిగా ఉంటారు.

నా ఫస్ట్‌ హిట్‌కి హ్యాపీ
మా నాన్న సంతోషపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినప్పుడు, విదేశాల్లో ఉద్యోగం సంపాదించినప్పుడు, నా మొదటి లైవ్‌ థియేటర్‌ ప్రదర్శన సమయంలో, అలాగే నా ఫస్ట్‌ సినిమా ‘బేబి’ సక్సెస్‌ అయినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డారు. మా నాన్నకు చిరంజీవిగారంటే ఎంతో అభిమానం. ‘బేబి’ సినిమాలో నా నటన గురించి ఆయన ప్రశంసించినప్పుడు మా నాన్న గర్వంగా, ఆనందంగా ఫీలయ్యారు.

గర్వంగా ఫీలవుతారు..
అన్న పెళ్లి మా నాన్నకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. చిన్నప్పుడు ఆయనకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అయితే అది నెరవేరలేదు. అన్న, నేను యాక్టర్స్‌గా ఉన్నందుకు ఆయనకు ఆనందంగా, గర్వంగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురం (విజయ్‌ భార్య, హీరోయిన్‌ రష్మికని ఉద్దేశించి) సినీ పరిశ్రమలో ఉన్నాం. ఇంటికి వచ్చేవారికి ఆయన ఈ విషయం గర్వంగా చెబుతుంటారు. అంతేకాదు, వదినకు కూడా ఆయన ఫాదర్‌ ఫిగర్‌లా మారిపోయారు.
– ఆనంద్‌ దేవరకొండ

– డి.జి. భవాని

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)