Breaking News

ఊబకాయానికి విరుగుడీ మాత్ర!

Published on Wed, 12/27/2023 - 16:34

స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్‌ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే.

అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్‌ కలిగించే ట్యాబ్లెట్స్‌ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్‌? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్‌ విశేషాలు మీ కోసం..

సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్‌పి-1 వంటి హార్మోన్‌లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్‌ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది.

దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్‌జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్‌ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్‌ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్‌లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు.

ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్‌ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్‌ ట్రీట్‌మెంట్‌లా పనిచేస్తోందని సీనియర్‌ సైంటస్ట్‌ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు.  పిల్‌లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్‌ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్‌, ఆఫ్‌ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)