Breaking News

ఔరా! ఆ పుట్టగొడుగు.. ఐదు లక్షలట!

Published on Thu, 01/23/2025 - 10:17

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికీ నగరం కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్‌స్టోరీస్‌ వేదికగా అక్షరాల రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగు (మష్రూమ్‌) అందరినీ ఔరా అనిపిస్తోంది. కాంటినెంటల్‌ ఫుడ్‌తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటి సారి ఈ రిషీ మష్రూమ్‌ సందడి చేస్తోంది. పారిస్‌కు చెందిన ఆర్కిటెక్చరల్‌ ఏజెన్సీ మల్హెర్బే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్‌స్టోరీస్‌ దేశంలో రెండోది కావడం విశేషం. 

ఈ ఫుడ్‌స్టోరీస్‌ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయెట్‌–హెన్నెస్సీ, పారిస్‌ ఏరోపోర్ట్, గివెన్చీ వంటి బ్రాండ్‌లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్‌ చాక్లెట్లు, గ్లోబల్‌ ప్యాంట్రీ, చీస్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. ఫుడ్‌స్టోరీస్‌ కిచెన్‌ స్టూడియో ఫుడ్‌ లవర్స్‌ను అలరిస్తోందని సహ వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 వేలకు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికే డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు.  

ఇదీ చదవండి: అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ


 

  

 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)