Breaking News

వేలెంటైన్స్‌ వర్సెస్ కవిత్వంతో కర్సేస్!!

Published on Sat, 02/14/2026 - 05:28

ఇవాళ్ల వేలెంటైన్స్‌ డే అటగా. తమ ప్రేమను కవితాత్మకంగా ఎక్స్‌ప్రెస్‌ చేసే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారటగా. అందుకే సినిమాల్లో ప్రేయసి మీద పాటలుంటాయటగా. చిన్నప్పట్నుంచీ నాదంతా సినిమా స్టైల్‌. అందుకే కవితంటే అదో అమ్మాయి పేరని మాత్రమే తెలిసినా, కవిత్వం రాతకు అక్షరమ్ముక్క రాకపోయినా... నేనూ కవితలు రాయడం మొదలుపెట్టా. 

అసలా పనిని నేను అ...ఆ... లు దిద్దడ మప్పట్నుంచే ప్రారంభించా. ఫ్యూచర్‌లో నేనెవరైనా అమ్మాయిని ఇష్టపడితే మరి అప్పటికప్పుడు కవిత్వం రాకపోతే ఎలా...? అందుకే... ఎందుకైనా మంచిదంటూ పేడపురుగు ఉండలు ఉండలుగా దొర్లించుకుపోయినట్టుగా... అప్పుడింతా అప్పుడంతా కవిత్వం పోగేసుకున్నా. అదంతా వరసల్లో పేర్చా. ఆ మాటల్లోని కొన్ని ఆణిముత్యాలూ.  ప్రేమరత్నాలూ ఇవే...  

ఓ నా ప్రేయసీ... 
నువ్వు మంచి ఫూడీవటగా... 
నీకు బహుమతిగా ఇద్దామని 
రంగురంగుల ఇంద్రధనుస్సును 
పనీర్‌ ముక్కల్లాగా కోసి 
ఆకాశపు నీలిప్లేటులో 
అడావుడిగా పట్టుకొచ్చా. 
ఆత్రంగా పెట్టుకొచ్చా.  

ఇంధ్రధనుస్సునే ఎందుకు వంచానని అడుగుతున్నావా? 
అందరూ చంద్రవంకల్నీ నెలవంకలనీ కవిత్వంలో 
రాస్తారట కదా. మరి... నేనందరికన్నా డిఫరెంటుగా! 
అందుకే వెల్లకిలా పడి ఉండే నెలవంక షేపుకు  
ఎగ్జాట్లీగా బోర్లావేసినట్టుండే రెయిన్బోనెంచుకున్నా.  

చాలామంది రక్తంతో ప్రేమలేఖ రాస్తారటగా 
నేను మాత్రం ఆ రెయిన్బో ముక్కల్ని  
వేడివేడిగా నీ నోటికందిద్దామని 
నా రక్తపు నూనెలో ఎర్రగా గోలిచ్చి పెట్టా.

స్టవ్వు మంటకు నా రక్తపు వేడి కూడా తోడైతే
నా బంగారానికి దీటుగా ఆ ముక్కలకీ బంగారపు రంగొచ్చేలా
మంచి డీప్‌ ఫ్రై చేయవచ్చని... దాంతో
నా లవ్వు కూడా డీపుగా ఉంటుదన్నది నా ఆశ.

ఆ ఫ్రై ముక్కల ప్యాకింగు కోసం
సిల్వర్‌ ఫాయిల్స్‌ కోసం ఎంతో వెదికా. 
టైముకు అవి కనిపించలేదు. అందుకే... 
పలచని స్ట్రాటోక్యుములస్‌ మబ్బులంచుల్లో ఉన్న 
వెండి సిల్వర్‌ లైనింగును కట్‌ చేసి వేడి తగ్గకుండానే 
సదరు పనీరింద్రధనుస్సు ముక్కల్ని ప్యాక్‌ చేసి పెట్టా.

నువ్వు నైసుగా కోసుకుని తినేందుకు 
నైఫు కూడా కనిపించలేదు. అందుకే... 
బోర్లా ఉన్న ఇంద్రచాపం వెన్ను బెండుతీసి 
ఓ అంచుకు బాగా సానపట్టా.

అదే రెయిన్‌బో చివరల్ని లైటుగా కాల్చి 
ప్రతిరంగు జాయింటు దగ్గర కొద్దిగా చీల్చి
రంగురంగుల ఫోర్కుగా దాన్ని 
నీకందిద్దామని ఇక్కడే వేచి చూస్తున్నా.

మన ఫాస్టెస్టు ట్రైనులా రాజధానెక్సెప్రెస్సులా
నా బ్లడ్‌ప్రెషరిప్పటికే ప్రేమపట్టాలపై గ్యాలప్పేస్తోంది. 
సూపర్‌సానిక్‌ స్పీడులో ఉన్న నా రక్తపోటు పంపును... 
యూఎస్‌ వెళ్లాలనుకున్న ఇంజనీరు పాలిటి ట్రంపులా 
అడ్డుపడి ఎలాగోలా అదుపులోకి తెచ్చెయవా ఫ్లీజ్‌!  

నా ప్రేమను యాక్సెప్ట్‌ చేయకుండా నన్ను నిరాశపరచి 
గేదె తగిలాక గాయపడ్డ వందేభారత్‌లా 
నా గుండెను గాయపరిచి వేడుక 
చూడకంటూ 
వేడుకుంటున్నాను. తోడుండమంటున్నాను.

ఇట్లు
మామిడిటెంక మన్మథలెంక 
  
ప్రేమలేఖకు ఈవినింగ్‌ లోపల జవాబూ వచ్చింది. 

‘‘ఏయ్‌ మిస్టర్‌... 
చదువుతున్నంతసేపూ గుర్తొచ్చింది షాకిచ్చే శాకినీ... 
చదివాక నా పరిస్థితి ఢామ్మంటూ ఢాకినీ!... 
ఇలా నువ్వు నీ లవ్‌లెటర్‌తో నా చెవిలో చేతబడి చేశావ్‌. 
కర్ణభేరిపై కాష్మోరా ప్రయోగించావ్‌. 
అసలే సినిమా పిచ్చోడివి కదా... 
అందుకే నీకర్థమయ్యేలా చెబుతున్నా విను. 
కవుల పట్ల జంధ్యాలకున్న అభిప్రాయాలన్నీ రీల్‌ చేసి ఇస్తున్నా.
చూడు. చూశాక... ఇంకెప్పుడూ 
నాకు కాల్‌ చేయకూ... కవిత్వంతో నన్ను కాల్చేయకు. 
– లవ్వు పాలిట యాంటీ ప్రొజెక్టరణీ... 
నీ ప్రేమ రిజెక్టరణి...

– యాసీన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)