Breaking News

వెజైనల్ డిశ్చార్జ్.. ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవాలంటే..

Published on Sun, 12/15/2024 - 11:42

నాకిప్పుడు 40 ఏళ్లు. అయిదేళ్లుగా వెజైనల్‌ డిశ్చార్జ్‌తో సఫర్‌ అవుతున్నాను. చాలా యాంటీబయాటిక్స్‌ వాడాను. అయినా రిజల్ట్‌ లేదు. ఇంకేదైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? ప్రయత్నించొచ్చా?
– పి. మైథిలి, హైదరాబాద్‌
35 ఏళ్ల వయసు దాటిన వారిలో హార్మోన్‌ చేంజెస్‌తో సర్విక్స్‌లో చాలా మార్పులు వస్తాయి. చాలాకాలంగా వైట్‌ డిశ్చార్జ్‌ అవుతూంటే ఇన్‌ఫెక్షన్స్‌ ఏమైనా ఉన్నాయేమో అని నిర్ధారించుకోవడానికి ముందుగా వెజైనల్‌ స్వాబ్స్, యూరినరీ ఏరియా స్వాబ్స్, ర క్త పరీక్షలు, పాప్‌ స్మియర్‌ వంటి టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటిలో ఏ సమస్యా లేదని తేలితే సర్విక్స్‌లోని మార్పులే కారణమనుకోవచ్చు. ఏ ఇన్‌ఫెక్షన్‌ లేకపోతే క్రయోకాటరీ అనే పద్ధతిని ఫాలో కావచ్చు. కొంతమందికి ఇది బాగా పనిచేస్తుంది. 

సర్వైకల్‌ ఎక్ట్రోపియన్‌కిచ్చే ట్రీట్‌మెంట్‌ ఇది. సర్వైకల్‌ ఎక్ట్రోపియన్‌ అంటే సాధారణంగా సర్విక్స్‌ లోపల ఉండే కణాలు సర్విక్స్‌ పైన కనిపించడం. కొలనోస్కోపీ అనే ప్రొసీజర్‌ ద్వారా సర్విక్స్‌లో కొంత డై స్టెయిన్‌ చేసి కెమెరా ద్వారా చెక్‌ చేసి చిన్న బయాప్సీ తీసి టెస్ట్‌కి పంపిస్తారు. ఈ రిపోర్ట్‌ నార్మల్‌గా ఉంటే సర్విక్స్‌లో ఏ ఇన్‌ఫెక్షన్, క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన మార్పులు లేవని అర్థం. కొలనోస్కోపీ ప్రొసీజర్‌ను కూడా పాప్‌ స్మియర్‌లాగే అవుట్‌ పేషంట్‌ విభాగంలోనే చేస్తారు. దీనికి అరగంట సమయం పడుతుంది. 

ఆ రిపోర్ట్‌ వచ్చాక క్రయోకాటరీ ప్లాన్‌  చేస్తారు. క్రయోకాటరీలో.. క్రయోప్రోబ్‌ అనే పరికరం ద్వారా సర్విక్స్‌లోకి ఎనర్జీ సోర్స్‌ను పంపించి, సర్విక్స్‌ పైన లేయర్‌ సెల్స్‌ అన్నింటినీ ఫ్రీజ్‌ అండ్‌ డిస్ట్రాయ్‌ చేస్తారు. అప్పుడు కొత్త, ఆరోగ్యకరమైన సెల్స్‌ తయారవుతాయి. ఈ ప్రక్రియలో ఫ్రీజింగ్‌ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను అవుట్‌ పేషంట్‌ విభాగంలోనే చేస్తారు. దీనికీ అరగంట సమయం పడుతుంది. పెయిన్‌కి పారాసిటమాల్‌ తీసుకోవచ్చు. చాలాకాలంగా అవుతున్న వైట్‌ డిశ్చార్జ్‌కిది మంచి ట్రీట్‌మెంట్‌. ఈ ప్రక్రియ తర్వాత రొటీన్‌గా అన్ని పనులూ చేసుకోవచ్చు. అయితే ఒక నెల రోజులు వాటర్‌ డిశ్చార్జ్‌కి ప్యాడ్స్‌ వాడాలి. ఇంటర్‌కోర్స్, స్విమింగ్‌కు ఒక నెల దూరంగా ఉండాలి. నెల పాటు హెవీ ఎక్సర్‌సైజెస్‌ కూడా చేయకూడదు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)