Breaking News

ఇంట్లో వాడే పాత్రల వెనుక ఇంత కష్టం ఉంటుందా?

Published on Fri, 03/15/2024 - 18:03

మనం నిత్యం ఎలా పడితే అలవాడే పాత్రలు ఎలా తయారవ్వుతాయో వింటే షాకవ్వుతారు. ఇంత శ్రమ ఉంటుందా! అనుకుంటారు. మనం పాత సామాన్లను అమ్మేస్తుంటాం. ఎంతో కొంత డబ్బులు తీసుకుని పనికిరాని సామాన్లను పాత సామాన్ల వాడికి ఇచ్చేస్తుంటాం. అలా వచ్చిన వాటిని వాళ్లు ఏం చేస్తారో తెలుసా..?

మనం నిత్యం కూరలు వండేది అల్యూమినియం పాత్రల్లోనే. వాటిల్లో వండొద్దని హెచ్చరిస్తున్నా.. మనం వాటిల్లోనే వండేస్తుంటాం. అవే అయితే కడగడం ఈజీ. పైగా అంత బరువు ఉండవు. వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు ఆ పాత్రలకే అలవాటు పడిపోయారు.  అదీగాక పెద్ద హోటల్స్‌, రెస్టారెంట్లలో కూడా వీటిని వాడుతుంటారు. కడిగేందుక వీలుగానూ, ఎక్కువ మొత్తంలో వండే కూరకు ఈ గిన్ని కాస్త వెసులుబాటుగా ఉంటుంది.

బరువు కూడా ఓ మోస్తారుగా ఉంటుంది. అలాంటి ఈ అల్యూమినియం పాత్రలను మనం ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం వీటి వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని నోరెళ్లబెడతారు. వాడిపడేసిన అల్యూమినయం చెత్తను బొగ్గుల వేడిపై కరిగించి వాటిని మంచిగా మరిగించి ఓ పాత్ర రూపంలో ఉన్న బట్టిలో వేసి అల్యూమినియం గిన్నెలను తయారు చేస్తారు. అవి అందంగా ఉండేలా మంచి పాలిష్‌ పెట్టడం ఒక వంతు. ఆ తర్వాత ఆ గిన్నెలను పట్టుకునేలా హ్యాండిల్స్‌ బిగించి చక్కగా గిన్నె తయారయ్యిందని నిర్థారించుకున్నాక కంపెనీ స్టిక్కర్‌ వేసి పొద్దికగా పెట్టడం ఒక ఎత్తు.

ఇంత తతంగం అయితే గానీ ఒక గిన్నే తయారవ్వదు. అయితే ఇలా తయారయ్యిన గిన్నెలు తక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయని అంటున్నారు నిపుణులు. వీటిలో సీసం, ఆర్సెనిక్‌, కాడ్మియం తదితర మెటల్‌ మలినాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వంట ప్రకియలో ఆయా కూరలు తయారు చేసేటప్పుడూ ఉప్పు, పులుపు వంటివి ఉంటాయని, వాటితో ఈ అల్యూమినియం రియాక్షన్‌ చెంది రంధ్రాలను ఏర్పరచటం లేదా అల్యూమినయంలోని విషపదార్థాలు ఈ కూరలో కలవడం జరుగుతుందని అన్నారు. ఇది ఆహారంగా తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తయాని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)