Breaking News

మహిళా పారిశ్రామివేత్తలకు అభినందనలు: యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌

Published on Sat, 11/23/2024 - 13:02

హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, అలయన్స్ ఫర్ కమర్షియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ (ఎసిఐఆర్) భాగస్వామ్యంతో ఇంటెన్సివ్ అకాడమీని విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్  తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్‌లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపారాల అభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. ఆరు నెలల  పాటుసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన 60మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 
 

మహిళా నాయకత్వం, మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం అమెరికా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని జెన్నిఫర్‌ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల అకాడమీ, వనరులు, కనెక్షన్‌లతో మహిళలను శక్తివంతం చేయడంతోపాటు, ఇండియాతో  తమ  భాగస్వామ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ తమ క్యాంపస్‌లలో ఏడబ్ల్యూఈ కోహార్ట్‌లను నిర్వహిస్తున్నందుకు  ఆమె ధన్యవాదాలు తెలిపారు.  హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో శుక్రవారం కాన్సులేట్‌ నిర్వహించిన అకాడమీ ఫర్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (ఏడబ్ల్యూఈ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.    ఈ కార్యక్రమం శుక్రవారం (నవంబర్ 22) జరిగింది. ఈ నెల(నవంబర్) 26న విశాఖపట్నంలోని  ఆంధ్రా యూనివర్సిటీలో   మరో ఈవెంట్‌ జరగనుంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)