Breaking News

CISF: మరో అడుగు...

Published on Sat, 11/16/2024 - 02:10

వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) బెటాలియన్‌ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్‌ భుజాలకెత్తుకోనుంది.

ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్‌ఎఫ్‌లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్‌ కమాండెంట్‌ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్‌ బెటాలియన్‌ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్‌ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

సీఐఎస్‌ఎఫ్‌ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్‌ హౌజ్‌ భద్రత వరకు సీఐఎస్‌ఎఫ్‌ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్‌–ఉమెన్‌ బెటాలియన్‌ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్‌ఎఫ్‌ వేసిన మరో అడుగు అనవచ్చు.

‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్‌ బెటాలియన్‌ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్‌ఎఫ్‌ మంచి ఎంపిక. కొత్త ఆల్‌–ఉమెన్‌ బెటాలియన్‌ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.

‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్‌ ఈక్వాలిటీని ప్రమోట్‌ చేయడానికి ఆల్‌–ఉమెన్‌ బెటాలియన్‌ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా సీఐఎస్‌ఎఫ్‌ హర్షం ప్రకటించింది.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి