Breaking News

చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా? యూకేలో వింత ఘటన

Published on Fri, 12/29/2023 - 10:52

చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమేనా? కానీ ఈ వింత సంఘటన నిజంగానే జరిగింది. లండన్‌కు చెందిన ఓ మహిళ చనియినట్లు నిర్థారించిన 40 నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది. స్పృహలో లేని ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆమె తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో సోషల్‌ మీడియాలో పంచుకుంది.


''చనిపోయాక మనిషికి ఇంకో జన్మ ఉంటుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మళ్లీ బతుకుతాను అన్న ఆశ లేని సమయంలో జీవితం మరో అవకాశాన్ని ప్రసాదించింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్త స్టూ, నేను డిన్నర్‌ డేట్‌కు ప్లాన్‌ చేసుకున్నాం. ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం అనుకునేలోపు సోఫాలో కుప్పకూలిపోయాను. స్టూ ఎంత పిలుస్తున్నా నాలో ఎలాంటి చలనం లేదు. నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది.

ఇంతలో నన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లడం, వాళ్లు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. నా కుటుంసభ్యులకు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు కూడా. కానీ నన్ను నేనే నమ్మలేకపోతున్నా. కోమాలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయిపోయాను'' అంటూ క్రిస్టీ బోర్టోస్‌ తెలిపింది. 

ఆమె చనిపోయిందని ప్రకటించిన 40 నిమిషాల తర్వాత క్రిస్టీ ప్రాణాలతో బయటపడడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. మెదడుకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే మనిషి బతికే ఛాన్స్‌ లేదు. మరి క్రిస్టీ విషయంలో జరిగిన మెడికల్‌ మిరాకిల్‌ ఏంటన్నది ఇప్పటికీ వైద్యులకు అర్థం కావడం లేదు.

గతంలోనూ పలుమార్లు ఆమె గుండెపోటుకు గురయ్యింది. అలాంటిది దాదాపు చావు వరకు వెళ్లి తిరిగిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోతే దెబ్బతింటుంది. కానీ క్రిస్టీని పరీక్షించినప్పుడు ఆమెకు గుండె, ఊపిరితిత్తులు, మెదడు అన్నీ అవయవాలు బాగానే ఉన్నాయని పరీక్షల్లో వెల్లడి కావడం మరో ఆశ్చర్యం. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)