Breaking News

డైనోసార్‌ అంతెత్తు..! కరములు కించిత్తు..!!

Published on Wed, 05/27/2026 - 12:02

టైరానసారస్‌ రెక్స్‌ అలియాస్‌ టీ రెక్స్‌. సింపుల్‌గా చెప్పాలంటే.. రాకాసి బల్లుల రాజ్యానికి రారాజు టైపు. డైనోసార్లలో సూపర్‌స్టార్‌ అన్నమాట. జురాసిక్‌ పార్కు సినిమాలన్నిటిలో దీనిదే కీలక పాత్ర. 45 అడుగుల పొడవు.. భీకరాకారం.. భయపెట్టే కళ్లు.. కరకరా నమిలేసే పళ్లు.. అయితే, అన్నీ ఎలివేషన్లే అయితే.. దీనికి బాగా పొగరు పెరిగిపోదూ.. ఈ డౌట్‌తోనేనేమో దీన్ని సృష్టించే సమయంలో దేవుడు దీనికి ‘హ్యాండ్‌’ ఇచ్చాడు. 45 అడుగుల టీ రెక్స్‌కు కేవలం మూడడుగుల పొడవుండే చేతులు మాత్రమే ఇచ్చాడు.

అంటే.. ఆరడుగుల మనిషికి ఐదు అంగుళాల చేతులు ఉన్నట్లన్నమాట. నిజంగా దేవుడు అలా చేశాడా లేదా అన్నది పక్కనపెడితే.. అత్యంత భయంకరమైన మాంసాహారిగా పేరొందిన టీ రెక్స్‌ చేతులు ఎందుకు అంత చిన్నగా ఉన్నాయి అన్న అంశంపై ఏళ్లుగా శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. వాళ్ల బుర్రలకు భరోసా కల్పిస్తూ యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకులు తామీ రహస్యాన్ని ఛేదించామని తాజాగా ప్రకటించారు.

ఇప్పటివరకూ దాని భారీ శరీర పరిణామం వల్లే చేతులు చిన్నవిగా ఉన్నాయని భావించారు. అయితే.. వేటలో చేతుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో.. పరిణామ క్రమంలో అవి చిన్నవి అయ్యాయని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తేల్చారు. ఇందుకోసం థెరోపాడ్‌ జాతి డైనోసార్లను పరిశీలించారు. టీ రెక్స్‌తోపాటు ఈ జాతిలోని మరికొన్నిటి చేతులు చిన్నవిగా ఉన్నాయని గుర్తించారు. 

‘‘చేతులు చిన్నగా ఉండటానికి కారణం.. వాటి బలమైన తల, దవడలే. పెద్ద జంతువులను వేటాడేటప్పుడు గోర్లతో కంటే.. దవడలతో దాడి చేయడం సమర్థవంతంగా మారింది. 100 అడుగుల పొడవుంటే భారీ సౌరోపాడ్‌ రాకాసి బల్లిని చేతులతో పట్టుకోవడం సాధ్యం కాదు. వాటిని తలను ఉపయోగించి.. దవడలతో దాడి చేయడం టీ రెక్స్‌కు ఈజీగా ఉండేది. దీంతో ఎప్పుడైతే.. ఉపయోగం తగ్గిందో.. అప్పటినుంచీ వాటి చేతుల సైజూ తగ్గిపోవడం మొదలైంది’’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన చార్లీ రోజర్‌ చెప్పారు. 

- సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)