Breaking News

భారత నారీమణుల అరుదైన సాహసం

Published on Fri, 01/31/2025 - 12:02

భారత నారీమణులు అరుదైన సాహసం పూర్తి చేశారు. భూగోళాన్ని చుట్టొచ్చి సరికొత్త చారిత్రక విజయానికి నాంది పలికారు. గురువారు ఈ ఇద్దరు నారీమణులు భూమిపై అత్యంత మారుమూల ప్రాంతమైన పాయింట్ నీమోను దాటి సరొకొత్త మైలురాయిని అధిగమించారు. ఆ నారీమణులు ఎవరు?. ఈ సాహసయాత్రని ఎప్పుడు ప్రారంభించారు తదితరాల గురించి చూద్దామా..!

ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నారీమణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే, లెఫ్టినెంట్ కమాండర్ రూపలు. ఈ ఇద్దరు మహిళా నావికా అధికారులు గురువారం తెల్లవారుజామున 12:30 గంటలకు ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్ (INSV) తరిణిలో న్యూజిలాండ్‌లోని లిట్టెల్టన్ నుంచి ఫాక్లాండ్ దీవులలోని పోర్ట్ స్టాన్లీకి వెళ్లే మూడో దశ జర్నీలో పాయింట్ నీమో(Point Nemo) గుండా వెళ్ళారు. ఇది భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం(Remote Location). చెప్పాలంటే సమీపం భూభాగం నుంచి దాదాపు 2,688 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

అలాంటి అత్యంత రిమోట్ ఓషియానిక్ పాయింట్‌కి చేరుకున్న నారీమణులుగా నిలిచారు. నావికాదళం కూడా ఈ సాహసయాత్రను నావికా సాగర్ పరిక్రమ II మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంది. అలాగే దీన్ని భారతదేశ నావికా అన్వేషణ చొరవలో భాగంగా ఇద్దరు మహిళా అధికారులు చేపట్టిన భూ ప్రదక్షిణంగా ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆ ఇద్దరు మహిళా అధికారులు ఆ ప్రాంతం నుంచి నీటి నమునాలను సేకరించారు. దీనిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్లేషిస్తుంది. ఈ నమూనాలు సముద్ర జీవవైవిధ్యం, నీటి రసాయన కూర్పుతో సహా సముద్ర పరిస్థితులపై విలువైన డేటాను అందిస్తాయని నేవీ పేర్కొంది. పైగా ఇది శాస్త్రవేత్తల సముద్ర శాస్త్ర పరిశోధనకు దోహదపడుతుందని తెలిపింది.

సాహస యాత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే..
ఈ ఇద్దరు నావికా అధికారులు అక్టోబర్ 2, 2024న భూమిని చుట్టి రావడానికి బయలుదేరారు. వారు గోవా నుంచి INVS తరిణిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు డిసెంబర్ 22న న్యూజిలాండ్‌లోని లిట్టెల్టన్ ఓడరేవుకు చేరుకుని, ఈ యాత్ర రెండొవ దశను పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో లిట్టెల్టన్ నుంచి ఫాక్లాండ్ దీవులలోని పోర్ట్ స్టాన్లీకి వెళ్లే అత్యంత సుదీర్ఘ సాహస యాత్ర కోసం బయలుదేరారు. ఈ దశలో దూరం దాదాపు 5,600 నాటికల్ మైళ్లు.

పాయింట్ నెమో గుండా INVS తరిణిలో ప్రయాణించడంతో పూర్తిగా నౌకాయానంతో చేసిన సాహసయాత్రగా నిలిచింది. ఈ సక్సెస్‌ని సముద్ర నావిగేషన్ పరంగా అత్యంత ఘన విజయంగా నేవీ పేర్కొంది. అత్యంత సంక్లిష్టమైన జలాల్లో చేసే ఈ యాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నది. 

వాటన్నింటిని అలవొకగా దాటుకుని విజయవంతంగా భూమికి మారుమూలగా ఉండే పాయింట్ నీమోని దాటడం విశేషం. దీన్నిఅంత ప్రాచుర్యం లేని మహా సముద్ర ధ్రువంగా పిలుస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మానవ నివాసానికి అత్యంత దూరంలో ఉండే ప్రదేశంగా పేర్కొంటారు.

ఈ పాయింట్ నెమో అంతరిక్ష నౌక శ్మశానవాటికగా పనిచేస్తుంది. అంటే  అంతరిక్ష కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా ఉపగ్రహాల కాలం పూర్తి అయ్యిన వెంటనే   తిరిగి భూ వాతావరణంలోకి పంపించేటప్పడు..ఈ సముద్ర జలాల్లోకి పంపిస్తారు. ఎందుకంటే జననష్టం జరగకుండా మానవనివాసానికి అత్యంత మారుమూలగా ఉండే ఈ రిమోట్‌ ఓషయోనిక్‌ పాయంట్‌ నెమోని ఉపయోగించుకుంటారట ఖగోళ శాస్త్రవేత్తలు.

 

(చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)