Breaking News

వేర్వేరు ఏడాదుల్లో పుట్టిన కవలలు.. ఇదెలా సాధ్యం?

Published on Thu, 01/04/2024 - 16:17

సాధారణంగా కవల పిల్లలంటే కొన్ని నిమిషాల తేడాతోనే, లేక గంటల వ్యవధిలోనే పుడుతుంటారు. కానీ న్యూజెర్సీలో మాత్రం గమ్మత్తైన సంఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. అదేంటి కవల పిల్లలు ఏడాది తేడాతో పుట్టడమేంటి అనుకుంటున్నారా..?అవును మీరు చదివింది నిజమే.

వివరాల ప్రకారం.. న్యూజెర్సీకి చెందిన బిల్లి హంఫ్రీ, అతని భార్య ఈవ్‌ ఈ ఏడాది నూతన సంవత్సరంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. నిండు గర్భిణీ అయిన ఈవ్‌కు డిసెంబర్‌ 31న పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.48 నిమిషాలకు ఓ బాబు జన్మించగా, మరుసటి రోజు 12:28 నిమిషాలకు మరో బాబు జన్మించారు. దీంతో కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు వేర్వేరు  సంవత్సరాల్లో పుట్టినట్లయ్యింది.

ఇది తమకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఈవ్‌ దంపతులు పేర్కొన్నారు. అయితే తన ఇద్దరు పిల్లలు పేరుకు మాత్రమే కవలలని, వారి ముఖ కవలికల్లో, దినచర్యలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తుందని, ఇదో విచిత్ర అనుభవం అని తెలిపారు.

మొదటి బాబు ఎజ్రా 6 పౌండ్ల బరువుతో ఉంటే, అతని తమ్ముడు ఎజెకియల్ 4 పౌండ్ల బరువుతో ఉన్నాడని వివరించారు. కాగా అయితే కవలలు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో వేర్వేరుగా జన్మించడం ‘20 లక్షల్లో ఒక్క ఛాన్స్‌’ అని వైద్యులు అంటున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)