Breaking News

హరి ప్రబోధనం తులసీ కల్యాణం

Published on Thu, 11/19/2026 - 14:22

హరి ప్రబోధనం తులసీ కల్యాణంభారతీయ సనాతన ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. హరిహరులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతి తిథి ఒక పర్వదినమే. ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధిని ఏకాదశి’ గా, ఆ మరుసటి రోజైన కార్తీక శుద్ధ ద్వాదశిని ‘క్షీరాబ్ధి ద్వాదశి’ గా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రెండు రోజులు కేవలం ఆధ్యాత్మిక సాధనకే కాకుండా, ప్రకృతి ఆరాధనకు కూడా ప్రతీకలుగా నిలుస్తాయి. 

ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, నాలుగు నెలల  పాటు క్షీరసాగరంలో శయనించి ఉంటారు. ఈ కాలాన్ని ‘చాతుర్మాస్యం’ అంటారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు యోగనిద్ర నుండి మేల్కొంటారు. భగవంతుడు మేల్కొనే పవిత్ర దినం కాబట్టి దీనిని ప్రబోధిని ఏకాదశి, దేవోత్థాన ఏకాదశి అని పిలుస్తారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేయడం వల్ల వేయి అశ్వమేధ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పద్మపురాణం పేర్కొంటోంది. చాతుర్మాస్య దీక్ష ముగిసే రోజు కావడంతో వివాహాలు, గృహప్రవేశాలు వంటి సకల శుభకార్యాలకు ఈ రోజు నుండే తిరిగి అంకురార్పణ జరుగుతుంది.

పాలసముద్ర మథనం.. క్షీరాబ్ధి ద్వాదశి
ప్రబోధిని ఏకాదశి మరుసటి రోజైన కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. వాడుకలో దీనిని ‘చిలుకు ద్వాదశి’ అని కూడా వ్యవహరిస్తారు. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని (క్షీరాబ్ధిని) మథించిన పవిత్రమైన రోజు ఇదే. ఈ మథనంలోనే శ్రీమహాలక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు వంటి దివ్య వస్తువులు ఉద్భవించాయి. యోగనిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు, సకల దేవతలతో కలిసి లక్ష్మీసమేతంగా బృందావనంలోకి (తులసి వనంలోకి) ప్రవేశించే శుభదినం ఇదే.

తులసి – దామోదర కల్యాణ మహోత్సవం
క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినంలో అత్యంత ప్రధానమైన ఘట్టం తులసి కల్యాణం. పురాణాల ప్రకారం, జలంధరుడు అనే రాక్షసుడి భార్య బంద పరమ పతివ్రత. లోకకల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించడంతో, ఆగ్రహించిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారమని శపిస్తుంది. ఆ శాపం వల్లే విష్ణువు ‘సాలగ్రామ’ శిలగా మారాడు. అనంతరం బృంద అగ్నిప్రవేశం చేయగా, ఆమె భస్మం నుండి ‘తులసి’ మొక్క ఉద్భవించింది.

బృంద భక్తికి, త్యాగానికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, తులసిని తన హృదయంలో స్థానాన్ని ఇస్తానని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ రూపంలో వివాహం చేసుకుంటానని వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు సాయంత్రం తులసి కోట వద్ద ఉసిరికాయ కొమ్మను (విష్ణు ప్రతిరూపం) నాటి, తులసి మాతకు, దామోదరుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తారు.

ఆచరించాల్సిన విధివిధానాలు
ద్వాదశి  పారణ: ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు, ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానమాచరించి, తులసి పూజ చేసిన తర్వాత భోజనం పారణ) చేయాలి.

కల్యాణ వేడుక: సాయంత్రం తులసి కోటను రంగవల్లులతో అలంకరించి, తులసి మొక్కకు నూతన వస్త్రాలు సమర్పించాలి. ఉసిరి కొమ్మను వరుడిగా, తులసిని వధువుగా భావించి పసుపు కొమ్ముతో మాంగల్యధారణ చేయాలి.

దీపదానం, నైవేద్యం: ఉసిరికాయలపై ఒత్తులు వేసి ఆవునెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల సకలపాపాలు నశించి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. చెరుకు గడలు, చిలగడదుంపలు, పండ్లు, వడపప్పు,పానకం నైవేద్యంగా సమర్పించాలి.

తులసి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించిన వారికి కన్యాదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ఆత్మశుద్ధికి, ప్రకృతి సంరక్షణకు నిదర్శనంగా నిలిచే ఈ పర్వదినాలను ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరుస్తాయి. 
– డి. వరలక్ష్మి

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)