Breaking News

తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!

Published on Sun, 10/22/2023 - 13:02

ఇటలీలో ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అరుదైన సమాధి ఉంది. మూసివేసి ఉన్న దీని ప్రవేశమార్గాన్ని తెరిచి, లోపలకు ప్రవేశించిన శాస్త్రవేత్తలకు ఇందులో అరుదైన కుడ్యచిత్రాలు కనిపించాయి. గ్రీకు పురాణాల్లో వర్ణించిన అధోలోకానికి సంబంధించిన దృశ్యాలు ఈ కుడ్యచిత్రాల్లో ఉండటం విశేషం. ఇది కనీసం రెండువేల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా. సమాధి లోపలి గోడలపై చిత్రించిన ‘సెర్బరెస్‌’ అనే మూడుతలల జాగిలం గ్రీకుపురాణాల్లో వర్ణించిన మాదిరిగానే ఉండటంతో, అధోలోకంపై విశ్వాసం కలిగిన పూర్వీకులు ఈ సమాధిని అధోలోక ప్రవేశమార్గంలా నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రీకు పురాణాల ప్రకారం ‘సెర్బరెస్‌’ అనే మూడుతలల జాగిలం అధోలోకానికి కాపలాగా ఉంటుంది. ఇటలీలోని నేపుల్స్‌నగర శివార్లలోని గిగ్లియానో పట్టణం వద్ద ఈ పురాతన సమాధి బయటపడింది. ఈ పరిసరాల్లోనే పురాతత్త్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇదివరకు కూడా రోమన్‌ సామ్రాజ్య కాలానికి చెందిన పలు సమాధులు బయటపడ్డాయి. అవన్నీ క్రీస్తుపూర్వం 510 నుంచి క్రీస్తుశకం 476 మధ్య కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాటిలో ఇంత స్పష్టమైన కుడ్యచిత్రాలు లేవని, తాజాగా బయటపడ్డ ఈ సమాధి వాటికి భిన్నంగా ఉందని చెబుతున్నారు. ఈ సమాధికి వారు ‘టోంబ్‌ ఆఫ్‌ సెర్బరెస్‌’ అని పేరు పెట్టారు. 

(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కోట!)

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)