ట్రంప్ సర్కారుకు షాక్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
గోళ్లు విరిగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
Published on Wed, 07/06/2022 - 09:35
వర్షాకాలంలో అధికంగా ఉండే తేమకు గోళ్లు విరిగిపోతుంటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం మరింత సున్నితంగా మారి పాడవుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...
- రాత్రి పడుకునే ముందు సైంధవ లవణం వేసిన నీటిలో పది నిమిషాలపాటు వేళ్లను నానబెట్టాలి. తరువాత తడిలేకుండా తుడిచి క్రీమ్ రాసుకుని సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పెళుసుబారకుండా ఉండటంతోబాటు గోళ్ల చుట్టూ ఉన్న చర్మం మృదువుగా మారుతుంది.
- ఆలివ్ ఆయిల్‌లో గోళ్లను మర్దన చేస్తే మరింత షైనింగ్‌గా కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను వేడిచేసి గోళ్ల మీద వేసి మర్థన చేయాలి. మర్దన తరువాత నీటితో కడిగేయాలి. రోజుకి రెండు సార్లు ఇలా చేయడం వల్ల గోళ్లు మరింత అందంగా మెరుస్తాయి.
- గోరు చుట్టూ ఉన్నచర్మానికి క్యూటికల్ సమస్య బాధిస్తుంటే తేనె రాసి మర్దన రాసి చేయాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగి తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యూటికల్ తగ్గు ముఖం పడుతుంది.
- పచ్చిపాలలో ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లు, చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోజూ రాత్రి పడుకునేముందు పచ్చిపాలలో చేతివేళ్లను పదినిమిషాలపాటు నానపెట్టి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో గోళ్లు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.
#
Tags : 1