Breaking News

భారత భవిష్య వెలుగురేఖలు

Published on Fri, 11/20/2026 - 03:26

‘ఇదిగో వీరే...భారత భవిష్యత్‌ వెలుగురేఖలు’ అంటూ వివిధ రంగాల దిగ్గజాలతో ‘టైమ్‌’ మ్యాగజైన్‌ తొలిసారిగా ‘టైమ్‌ 100 నెక్ట్స్‌ ఇండియా 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ శత దిగ్గజాలలో కొందరు మహిళల గురించి...

ప్రాజెక్ట్‌ బాల
భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పీరియెడ్‌ పావర్టీ ఉంది. శానిటరీ నాప్‌కిన్‌లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, ఇది మాత్రమే సరిపోదని తెలుసుకున్న సౌమ్య దబ్రివాల్, ఆరాధన రాయ్‌ గుప్తాలు ప్రాజెక్ట్‌ బాల’ పేరుతో మెన్‌స్ట్రువల్‌–హెల్త్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. పీరియెడ్స్‌ చుట్టూ ఉన్న ఎన్నో అపోహలను తొలగిస్తున్నారు. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న వీరి ప్రాజెక్ట్‌ బాల’ 18 లక్షల మంది మహిళలు, బాలికలకు చేరువైంది. వేలాదిమంది ‘బాల బాస్‌’లకు శిక్షణ ఇచ్చింది. ‘బాల బాస్‌’ అంటే మెన్‌స్ట్రువల్‌–హెల్త్‌ ఎడ్యుకేటర్స్, ప్రాడక్ట్‌ డిస్ట్రిబ్యూటర్‌లుగా పనిచేసే స్థానిక మహిళలు.
సక్సెస్‌ మంత్ర: ‘ఇది చాలదు. ఇంకా ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకున్నప్పుడే మార్పు, మంచి ఫలితాలు సాధ్యం అవుతాయి’

ఆశాభావమే అసలైన శక్తి
సింగర్, కంపోజర్, రైటర్, పొయెట్‌ సానియా ఎంక్యూ పేదరికం నుంచి పితృస్వామ్యం వరకు రకరకాల సమస్యలపై పాటలు రాస్తారు. గానం చేస్తారు. ప్రజల్లోకి తీసుకువెళతారు. ‘ది ధారవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’ టెలివిజన్‌ టాలెంట్‌ షో ‘హునర్‌బాజ్‌’తో గుర్తింపు తెచ్చుకున్నారు. బిల్‌బోర్డ్‌ ఇండియా 25 అండర్‌ 25 జాబితాలో చోటు సాధించారు. 
సక్సెస్‌ మంత్ర: ‘ఎప్పుడూ ఆశాభావంతో ఉండాలి. మనల్ని ముందుకు తీసుకువెళ్లే రోజు ఒకటి వస్తుందని నమ్మాలి’.

అపూర్వ గణిత మేధావి
మన దేశంలోని గణిత మేధావులలో ఒకరైన నీనా గుప్తా గణితానికి సంబంధించి ప్రపంచంలోని అగ్రశ్రేణి గణిత శాస్త్రవేత్తలు సైతం పరిష్కరించ లేకపోయిన ఒక చిక్కుముడిని పరిష్కరించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అత్యున్నతమైన శాంతిస్వరూప్‌ భట్నాగర్‌తో సహా ఎన్నో పురస్కారాలందుకున్నారు. సక్సెస్‌ మంత్ర ‘గణిత శాస్త్రానికి సంబంధించిన విజయ రహస్యం ... ప్రపంచ మేధావులను సైతం కలవరపరిచే సమస్యలను పరిష్కరించడం’.

సామాజిక బాధ్యత
చిత్రనిర్మాత, స్క్రీన్‌ రైటర్‌ పి.పద్మరాజన్  ప్రేరణతో సినిమాల్లోకి వచ్చిన కుని కుశృతి సినిమా అనేది వినోదం మాత్రమే కాదు సామాజిక సందేశానికి బలమైన వేదిక కూడా అని గ్రహించారు. ‘గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ‘అస్సీ’ లాంటి చిత్రాలతో కుని కుశృతి అపూర్వ నట ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. అంతర్జాతీయంగా ఈ చిత్రాలకు లభించిన ఆదరణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
సక్సెస్‌ మంత్ర: ‘ఒక రంగంలోకి అడుగు పెట్టామంటే అంతులేని తపన ఉండాలి. దీనికి సామాజిక బాధ్యత తోడు కావాలి’.

‘చిత్ర’ధనుస్సు
కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి మెగా ఫోన్‌ పట్టుకున్నారు అనుపర్ణరాయ్‌. తొలి చిత్రం ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్గాటెన్‌ ట్రీస్‌’కు ఉత్తమ దర్శకురాలిగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. ఆమె ఎంచుకునే ఇతివృత్తాలలో లింగ సమానత్వం నుంచి అణగారిన వర్గాల వరకు ఎన్నో అంశాలు... ఆమె తన చిత్రాల ద్వారా అత్యంత కీలకమైన, అత్యవసరమైన ప్రశ్నలు సంధిస్తుంటారు.
సక్సెస్‌ మంత్ర: ‘నేను నా జీవితం నుంచి మాత్రమే స్ఫూర్తి పొందుతాను. అందులో ఇరవై శాతం మాత్రమే నిజం. మిగతాది కల్పితం!’

కొత్తదారులలో..
కేరళలోని తిరువనంతపురం లో జన్మించిన దేవి సీతారామన్‌ ప్రసిద్ధ పెయింటర్‌. ఆమె కళారూపం ‘బ్రదర్స్, ఫాదర్స్‌ అండ్‌ అంకుల్స్‌’కు అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. తండ్రి ఉద్యోగం కారణంగా చైనా, కంబోడియా, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, సింగపూర్‌లో పెరిగిన దేవికి బాల్యం నుంచి చిత్రకళపై ఆసక్తి, అనురక్తి. సింగపూర్‌లోని ‘లాసాల్‌ కాలేజీ ఆఫ్‌ ది ఆర్ట్స్‌’లో  పెయింటింగ్‌లో బీఎఫ్‌ఏ పట్టా తీసుకున్నారు. భారతీయ దైనందిన 
గృహజీవితాలు ఆమె చిత్ర ఇతివృత్తాలు.
సక్సెస్‌ మంత్రా: ‘మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. కొత్తదారులు వెదుకుతూ ఉండండి’.

ఆ అద్భుతాలు మన దగ్గరే!
పద్మ యాంగ్చాన్‌ లడఖ్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొందిన పద్మ ఆ తరువాత పారిశ్రామికవేత్తగా అడుగులు వేసి విజయం సాధించారు. లడఖ్‌లోని స్థానిక కళలు, చేతివృత్తులను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. 2016లో ‘నమ్జా కౌచర్‌’ పేరుతో వస్త్రపరిశ్రమను స్థాపించారు. సంప్రదాయ స్థానిక వస్త్రాలను తయారుచేయడమే ఈ సంస్థ బలం. ఉల్లిపాయలు, పొద్దుతిరుగుడు పువ్వులు, గులాబీలను ఉపయోగించి కొత్తరంగులను తయారు చేశారు. 
సక్సెస్‌మంత్రా: ‘కొత్తదనం, అద్భుతాల కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. అవి మన చుట్టూనే ఉంటాయి. మన మూలాల్లోనే ఉంటాయి’.

చౌకగా సౌరవిద్యుత్‌
కొన్ని సంవత్సరాల క్రితం.. మనదేశంలో బొగ్గు కంటే సౌరవిద్యుత్‌ను చౌకగా అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు తాన్యా సింఘాల్‌. ఆ సంకల్పం మాట ఎలా ఉన్నా ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ‘సోలార్‌ అరైజ్‌’ను స్థాపించారు. ఏడు సౌర విద్యుత్‌ ΄్లాంట్లను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్‌లు వేలాది ఇళ్లకు సౌరవిద్యుత్‌ను అందించాయి. ఏటా సుమారు 600,000 టన్నుల కర్బన ఉద్గారాలను నివారించాయి. ‘మైంజో కార్బన్‌’ అనే క్లైమెట్‌–టెక్‌ ΄్లాట్‌ఫామ్‌ను స్థాపించారు తాన్యా సింఘాల్‌. 
సక్సెస్‌ మంత్రా: లక్ష్యంపై మనకు గట్టి నమ్మకం ఉంటే.. అదే తిరుగులేని విజయమవుతుంది’.

– యాకూబ్‌ పాషా

 

#

Tags : 1

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)