Breaking News

మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!

Published on Sun, 06/23/2024 - 16:26

శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసంతో పోలిస్తే.. వెజిటేరియన్ ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. అదీగాక మాంసం వినియోగం పెరిగేకొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు వెజిటేరియన్లుగా మారిపోతున్నారు. పైగా ఈ శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా. మన దేశంలో దాదాపు 40 శాతం మందికి పైగా శాఖాహారులే. అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినడం సాధ్యం కాదు. పైగా ఈ నగరాలను భారత దేశ పూర్తి శాకాహార నగరాలుగా పిలుస్తారు. ఆ నగరాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!

రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. మనశ్శాంతి , మోక్షం కోసం చాలా మంది ప్రజలు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ఈ నగరానికి వస్తారు. నగరం చుట్టూ ముళ్ల చెట్లు , పచ్చని కొండలు ఉన్నాయి. దీన్ని దేవతల భూమిగా పిలుస్తారు. ఇక్కడ మాంసం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శాకాహారం మాత్రమే దొరుకుతుంది.

వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బనారస్ లేదా కాశీ అని కూడా అంటారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే నిర్మించాడని నమ్ముతారు. ఇక్కడ మీరు అన్ని రకాల రుచికరమైన,స్వచ్ఛమైన శాఖాహారం తినవచ్చు.

హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగానది ఒడ్డున హరిద్వార్ ఒక ప్రకాశవంతమైన నగరం. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా అలరారుతుంది. ఇక్కడ 
వేయించిన ఆహారం నుంచి సలాడ్లు , సూప్‌ల వరకు అన్ని రకాల శాకాహారాలను ఇక్కడ ప్రయత్నించవచ్చు.

మదురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని రాష్ట్రానికి గుండెకాయ అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాఖాహారం. కానీ ఈ నగరం భారతదేశపు నిజమైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. అత్యంత రుచికరమైన, పోషక విలువలు కలిగిన శాకాహార వంటకాలు ఇక్కడ లభిస్తాయి.

అయోధ్య, ఉత్తరప్రదేశ్ : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా మాంసం దొరకడం లేదు. అయోధ్య పురి మొత్తం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ ఒక్క మాంసాహార రెస్టారెంట్ కూడా లేదు.

పలిటానా, గుజరాత్: ఈ నగరం (గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా) కూడా పూర్తిగా శాకాహామే.. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా పేరుగాంచింది. కనుక ఇది శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది జైనులను కఠినమైన శాకాహారులుగా పిలుస్తారు. కాబట్టి ఈ నగరంలో శాకాహారం మాత్రమే వడ్డిస్తారు.

బృందావన్, ఉత్తరప్రదేశ్: ఇది మథుర జిల్లాలోని ఒక చారిత్రక నగరం.ఇది మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు , మాంసం అమ్మకాలు నిషేధం.

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగరం కొండపై ఉన్న తిరుమలలలో కూడా మాంసాహారం పూర్తిగా నిషేధం. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ మాంసాహారం పూర్తిగా నిషేధం.

(చదవండి: 60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌ ఇవే..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)