Breaking News

జెంటిల్‌మెన్‌లా ఉండాలనుకుంటే..అవి అస్సలు చేయకూడదు!

Published on Tue, 09/26/2023 - 10:46

పరస్తుతి, పరనింద, ఆత్మస్తుతి, ఆత్మనింద – ఈ నాలుగూ సజ్జనులు చేసే పనులు కావు అని మహాభారతంలో ఒక నీతి ఉంది. ‘అన్య కీర్తనంబు, అన్య నిందయు, తన్ను/ పరగ పొగడికోలు, ప్రబ్బికోలు,/ ఆపగా తనూజ! ఆర్యవృత్తములు కా/వనిరి వీని ఆద్యులైన మునులు...’ ఇక్కడ ‘ఆపగా తనూజుడు’ (నదీ పుత్రుడు) అంటే గాంగేయుడైన భీష్ముడు.  ఆ ధర్మవేత్తకు ఈ నీతి బోధిస్తున్నది ఛేదిరాజు శిశుపాలుడు. ‘నువ్వు అదే పనిగా శ్రీకృష్ణుడినే పొగుడు తున్నావు. ఇది  పెద్దలు చేయదగిన పనికాదు’ అని శిశుపాలుడి అభ్యంతరం. ఉటంకించింది శిశుపాలుడయినా, ఇది ‘ఆద్యులైన మునుల’ మాట కదా! పెద్దలిలా ఎందుకు చెప్పారో ఇంచుక చింతన చేసుకొంటే తప్పులేదు.

పరులను వాళ్ళ ఎదుటే ‘ముఖస్తుతి’ చేసే వాడు... పలచనైపోయి, ఆశ్రితుల స్థాయికి జారిపోతాడు. గౌరవం కోల్పోతాడు. పరులను వాళ్ళ పరోక్షంలో పొగిడినా, అలా పదేపదే చేస్తుంటే... దానివల్ల తనవాళ్ళకు నిరుత్సాహం కలగడమే కాక, వాళ్ళు దాన్ని పరి పరి విధాలుగా అపార్థం చేసుకొనే ప్రమాదం ఉంది. అలాగే పరనింద కూడా ప్రయోజన శూన్యం. అహంకారాన్ని ప్రకటించుకోవడమూ, శత్రుత్వాన్ని పెంచుకోవడమూ తప్ప నింద వల్ల సాధించేదేముంది? నిందను సకారాత్మకంగా స్వీకరించి, తమ ‘తప్పు’ గ్రహించి మారిపోయే ‘పరులు’  ఎక్కడయినా ఉంటారా?

చేతలే చెప్తాయి..
ఆత్మస్తుతి సరేసరి. అది సాధారణంగా అల్పత్వాన్నీ, ఆత్మ న్యూనతా భావాన్నీ సూచిస్తుంది. ధీరులూ, సమర్థులూ వాళ్ళ ఘనత వాళ్ళు చెప్పుకోరు. ఘనతను చేతలే చెప్తాయి. చేతలులోపించి నప్పుడే మాటలు. ‘నేను ఘనుడిని’ అని ఎంత చెప్పుకొన్నా దానికి విలువా, విశ్వసనీయతా ఉండవు. నమ్మేదెవరు? ఆత్మనింద కూడా ప్రమాదకరమే. ఆత్మవిమర్శతో తన తప్పులు గ్రహించుకొని, తొలగించుకొంటే మంచిదే కానీ ఊరకే తనను తాను నిందించుకొంటూ కూర్చొంటే, అది ఉన్న ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కూడా దెబ్బ తీసి, క్రమంగా మరింత పిరికితనానికీ, అసమర్థతకూ, కుంగుబాటుకూ దారి తీస్తుంది. 

అయితే ఒకటి! మహాభారతమయితే ఇలా చెప్పింది కానీ ఈ రోజులలో, ఆత్మస్తుతీ, పరనిందా, దాంతోపాటు అవసరార్థం   ‘తమంత వారు లేరు సుమా!’ అంటూ పరస్తుతీ, లోకం చేత ఓహో అనిపించుకొనేందుకు అప్పుడప్పుడూ ఆత్మనిందా మానేస్తే, సమా జంలో ఎక్కువగా మౌనమే రాజ్యం చేయాల్సివస్తుందేమో!
– ఎం. మారుతి శాస్త్రి

(చదవండి: గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?)

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు