Breaking News

60 ఏళ్లు దాటిన వాళ్లు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Published on Fri, 12/08/2023 - 13:12

వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజం. కీళ్ల నొప్పులు, చర్మం సాగిపోవడం, సత్తువ లేకపోవడం, జీవక్రియ మందగించడం వంటి సమస్యలు ఎన్నో చుట్టుముడతాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటాక ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందుకే వయసుకు తగ్గట్లు ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరు పదుల వయసు దాటిన వాళ్లు తమ డైట్‌ ప్లాన్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. 

సుమారు 60 ఏళ్లు పైబడిన వారికి విటమిన్స్‌ అత్యవసరం. వయసు పైబడుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది. రుచి, వాసన, గ్రహణ శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు తగ్గట్లుగా సరైన ఆహారం తీసుకోవాలి. మహిళల్లో 40 ఏళ్లు దాటితే కండరాలు బలహీనపడటం సహజం. 60 తర్వాత కండరాల క్షీణత మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రోటీన్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

ఇవి కండరాల శక్తిని మెరుగుపరుస్తాయి. వయసు పైబడిన వృద్ధులు ప్రతి కిలోగ్రాము బరువుకు 1 నుంచి 1.2 గ్రాముల ప్రోటీన్‌ తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు గట్టిపడాలంటే వారు మరింత కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

ప్రోటీన్‌ ఉండే ఆహారాలు
బాదం, చేపలు,
పెరుగు, డార్క్‌ చాక్లెట్‌,
సోయామిల్క్‌, లెంటిల్స్‌,
చీజ్‌, చికెన్‌
గుమ్మడి విత్తనాలు,
చిక్కుడు,ఆవు పాలు
పీనట్‌ బటర్‌

కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుడు గింజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన మహిళలు అందరూ రోజుకు  21 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఫైబర్ తినాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సిఫార్సు చేస్తోంది. అదే వయసు గల పురుషులు  30 లేదా అంతకంటే ఎక్కువ గ్రాములు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకోవాలి. తగినంత ఫైబర్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు తెలిపారు. 

ఫైబర్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు
యాపిల్స్‌
బార్లీ
బ్లాక్‌ బీన్స్‌
బ్లాక్‌ బెర్రీలు
బ్రాన్‌ ఫ్లేక్స్‌
బ్రకోలి
చియా సీడ్స్‌
రోజ్‌ బెర్రీస్‌
బఠాణీలు, పప్పులు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)