Breaking News

అనంతగిరి హిల్స్‌.. ది బ్రీజ్‌

Published on Mon, 02/09/2026 - 11:28

ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పద్మనాభస్వామి దేవాలయం, కొలను, టీబీ హస్పిటల్‌ ఇతర పర్యాటక ప్రాంతాలు నగరవాసులకు సుపరిచితమే. అటవీ ప్రాంతంలో కర్ణాటకలో ‘జంగల్‌ లాడ్జెస్‌ అండ్‌ రిసార్ట్స్‌’ తరహలో ఎకో టూరిజం బ్రాండ్‌గా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ‘డెక్కన్‌ వుడ్స్‌ అండ్‌ ట్రయల్స్‌’ పేరిట ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. పర్యాటకుల కోసం వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో ‘ది బ్రీజ్‌’ను తిర్చిదిద్దింది. అనంతగిరిని విజిట్‌ చేయాలనుకునే పర్యాటకులకు ఓ కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ నాయక్‌ తెలిపారు.  

పర్యాటకుల కోసం ది బ్రీజ్‌లో 
జంగిల్‌ కాటేజెస్‌ నిర్మించారు. ట్రెక్కింగ్, బర్డ్స్‌ వాక్, నైట్‌ క్యాంప్స్, సఫారీ, బుష్‌ బ్రెక్‌ఫాస్ట్‌ వంటి వినూత్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. అటవీ విజ్ఞాన శాస్త్రం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివిన నేచురలిస్ట్‌లు అడవులు, వృక్ష వైవిధ్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హస్పిటాలిటీ తదితర అంశాలను ఇందులో భాగంగా వివరిస్తారు. ప్యాకేజీ బుక్‌ చేసుకున్న పర్యాటకులను మధ్యాహ్నం 1 గంటకు ది బ్రీజ్‌లో మేనేజర్‌/ నేచురలిస్ట్‌ బృందం రిసీవ్‌ చేసుకుంటుంది. మధ్యాహ్నం 10 రకాల వంటలతో భోజనం అందిస్తారు.  

షెడ్యూల్‌ ఇలా.. 
విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ట్రెక్కింగ్, బర్డ్‌ వాక్‌ చేస్తూ సూర్యాస్తమయం వ్యూ తిలకిస్తారు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో చెట్లు, పక్షులు, గడ్డి, జంతువుల గురించి వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రిసార్ట్‌లో స్నాక్స్‌ అందిస్తారు. రాత్రి 7.30 గంటలకు క్యాంప్‌ ఫైర్‌ వేసి వైల్డ్‌ లైఫ్‌ గురించి అనేక విషయాలు వివరిస్తారు. రాత్రి 8.45 గంటలకు నాన్‌వెజ్‌ డిన్నర్‌ అందిస్తారు. రాత్రి టెంట్‌లో బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు మొదలయ్యే సఫారీ దాదాపు 10 కిలో మీటర్లు అడవీలో తిరుగుతారు. 8.45 గంటలకు అడవిలో బుష్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ఉంటుంది. తిరిగి ఉదయం 11 గంటలకు చెక్‌ అవుట్‌ ఉంటుంది.

ప్యాకేజీ వివరాలకు.. 
సందర్శించాలనుకునే పర్యాటకులు వివిధ ప్యాకేజీలను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాల కోసం వెబ్‌ సైట్‌ : deccanwoodsandtrails. com/  9493549399, 9885298980 
నెంబర్లలో సంప్రదించవచ్చు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)