Breaking News

Telugu Language Day 2024 : తేనె పలుకుల తెలుగు భాషను కాపాడుకుందాం!

Published on Thu, 08/29/2024 - 11:04

‘దేశ భాషలందు తెలుగు లెస్స’అన్న శ్రీకృష్ణదేవరాయలు పొగడ్తలు,  ‘‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’’ అని వేనోళ్ల కీర్తించిన వైనం  ప్రతి తెలుగు గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

 ప్రతి యేటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటాము. తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) జయంతి  సందర్భంగా, తెలుగు భాషకు ఆయన చేసిన అమూల్యమైన కృషిని, సేవలను గుర్తు చేసుకుని, గౌరవించుకునేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించారు.

 గ్రాంథిక భాషకు ప్రత్యామ్నాయంగా తెలుగు యాసను ప్రాచుర్యంలోకి తెచ్చి, వ్యావహారిక భాష ప్రాచుర్యాన్ని ఒక ఉద్యమంలా నడిపించిన గిడుగు వెంకట రామమూర్తికి యావత్‌  తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు. భారతదేశంలోని పురాతన, అత్యంత శక్తివంతమైన భాషలలో ఒకటి తెలుగు భాష. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడుకొనే భాష తెలుగు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉండటం విశేషం.

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన లాంటి ఉద్దండ కవులు, సుమతీ, వేమన లాంటి శతకకారులు తమ భాషా పాండిత్యంతో తెలుగు ఖ్యాతిని విస్తరింపజేసిన మహానుభావులు. గిడుగు రామ్మూర్తితో పాటు గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం,  కాళోజీ, డా. సి.నారాయణరెడ్డి లాంటి ఎందరెందరో కవులు రచయితలు తెలుగు భాషోన్నతి కోసం పాటు పడినవారే.

చక్కని పలుకుబడులకు, నుడికారాలు, అనేక చమత్కారాలతో నిండి ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని కాపాడుకోవాలి. తెలుగుభాష కనుమరుగైపోతోందన్న ఆందోళన నేపథ్యంలో తెలుగు భాషను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉంది. ఏ దేశమేగినా,  ఎందుకాలిడినా అన్నట్టు మన తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రతిష్ఠను నిలుపుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా - కాళోజీ

“తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష”  -నండూరి

“మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” - కొమర్రాజు లక్ష్మణరావు 

క్రీ.శ. 1400-1500 మధ్య నికోలో డి కాంటీ అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ మన భారతదేశానికి వచ్చాడు.క్రమంలో తెలుగు ప్రజలని కలిశాడు. వారి భాష, ఉఛ్చారణ తీరు చూసి ముగ్దుడైనాడు. తెలుగు భాష ఉచ్ఛరణ అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఉన్నట్లు గుర్తించాడు. ఒక ఇటాలియన్‌ భాషలో మాత్రమే ఇలాంటి సంప్రదాయం ఉన్నట్లు  గుర్తించాడు. అందుకే తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేర్కొన్నాడు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)