Breaking News

Doddi Komaraiah తెలంగాణ వేగు చుక్క

Published on Thu, 07/03/2025 - 15:58

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘటన దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) తెలంగాణ వేగు చుక్క మరణం. కొమురయ్య కడవెండి గ్రామ యువకుడు. నిజాం రాజ్యంలో ప్రముఖుడైన విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రామ చంద్రారెడ్డి కింద ఉన్న 60 గ్రామాలలో కడవెండి ఒకటి. ఇక్కడే దేశ్‌ముఖ్‌ తల్లి జానమ్మ నివసిస్తూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది. ఆంధ్ర మహాసభ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్‌ అకృత్యాలనూ, పెత్తందారీ సంస్కృతినీ విమర్శించడం, ధిక్కరించడం మొదలు పెట్టింది. దున్నేవానికే భూమి, అక్రమ పన్నుల రద్దు వంటి కమ్యూనిస్ట్‌ నినాదాలతో ప్రేరేపితమయ్యింది. వెట్టి చాకిరీ, రకరకాల పన్నులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ వంటి వాటికి వ్యతిరేకంగా గ్రామం సంఘటితమవుతూ ఉంది. 

ఈ క్రమంలో కడవెండి గ్రామానికి 1946 జూలై 4న  నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు వచ్చారు. తమ దగ్గర తినడానికే ధాన్యం లేదనీ, లెవీ ధాన్యం ఎక్కడి నుంచి తేవాలనీ ప్రశ్నించారు గ్రామస్థులు. లెవీ వసూలుకు వ్యతిరేకంగా, దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా రెతులు, కూలీలు ఆ రోజు ఒక ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో దొడ్డి కొమురయ్య– మల్లయ్య సోదరులు కూడా పాల్గొన్నారు. వారు ముందువరుసలో ఉండి నినాదాలు చేస్తూ  ముందుకు కదులుతుండగా మిస్కిన్‌ అలీ నేతృత్వంలో దొర గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. తూటాలు తగలడంతో కొమురయ్య మృతిచెందాడు. అనేకమందికి గాయాలయ్యాయి. కొమురయ్య అంత్యక్రియలకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. అతడి మరణంతో కమ్యూనిస్టులు తామూ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో సాధారణ రైతాంగ పోరాటం మహత్తర సాయుధ  పోరాటంగా మారింది. ఉద్యమం తాకిడికి భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములను పేద రైతులు, కూలీలకు పంచారు నాటి ఉద్యమ నాయకులు. 
– అస్నాల శ్రీనివాస్‌ ‘ దొడ్డి కొమురయ్య ఫౌండేషన్‌ 
(జులై 4 దొడ్డి కొమురయ్య వర్ధంతి)

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)