Breaking News

అపూర్వ స్వరం అసాధారణ ధైర్యం

Published on Tue, 07/07/2026 - 04:56

‘ఛీ... నువ్వు ఆడమనిషివేనా?’ అంటూ పెద్దమనుషులు తీజన్‌ బాయిని కుల బహిష్కరణ చేశారు. ఆమె చేసిన తప్పు... పురుషులకు మాత్రమే పరిమితమైన పాండవాణి’ని ఆలపించడం. ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. ఒకటి మాత్రం దండిగా ఉంది. ‘నేను బతకగలను. లోకం మెచ్చేలా బతకగలను’ అనే అపారమైన ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను ప్రాచీన జానపద కళారూపం పాండవాణి’ లెజెండ్‌ను చేసింది. ప్రపంచమంతా తిరిగేలా చేసింది. ఆమె జీవితం కేవలం కళాప్రతిభకు సంబంధించిన విశేషం మాత్రమే కాదు... వ్యక్తిత్వ వికాస కోణంలో ఎంతోమంది నిస్సహాయులకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే కాంతిపుంజం...

బ్రిజ్‌లాల్‌ పర్థీ మహాభారత ఘట్టాలను చెప్పే దృశ్యాలు మామూలుగా ఉండవు. ఒకే సమయంలో కర్ణుడు అవుతాడు. దుర్యోధనుడవుతాడు. మంచివాడవుతాడు. చెడ్డవాడవుతాడు. అమ్మాయి అవుతాడు. అబ్బాయి అవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఆయన ముఖమే రంగస్థలం. ఆ ముఖ రంగస్థలంలో ఎన్నో పాత్రలు వచ్చి పోతూ ఉండేవి. తాత బ్రిజ్‌లాల్‌ పుణ్యమా అని చిన్నారి తీజన్‌బాయికి కళలపై ఆసక్తి మొదలైంది.

పాత సంస్కృతిని బ్రేక్‌ చేసి...
ఛత్తిస్‌గఢ్‌లోని భిలాయ్‌కి దగ్గరలోని గనియారి అనే గ్రామంలో పుట్టి పెరిగింది తీజన్‌బాయి. పన్నెండేళ్ల వయసులోనే తీజన్‌కు పెళ్లయింది. ఈ వివాహబంధం సంవత్సరం కూడా నిలవలేదు! పదమూడేళ్ల వయసులో తొలిసారిగా రంగస్థలంపైకి వచ్చింది తీజన్‌. అప్పటివరకు ‘వేదమతి’ శైలిలో మాత్రమే పాడేవారు మహిళలు. అంటే కూర్చొని మాత్రమే పాడేవారు. ఈ సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తూ ‘కపాలిక శైలి’ (నిలబడి పాడే పద్ధతి)లో పాడింది తీజన్‌.

ఎటూ కదలకుండా ఒకచోట కూర్చొని బిడియంగా పాడే శైలికి భిన్నంగా పాండవాణి శైలిలో... ‘ఈ రంగస్థలమంతా నాదే’ అన్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ తీజన్‌ స్వేచ్ఛగా పాడిన పద్ధతి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పాండవాణి’ అంటే పాండవుల కథలు అని అని అర్థం. ఒక చేతిలో ఏక్‌తార లేదా తంబూర మరో చేతిలో ఖర్తాల్‌(తాళాలు) వాయిస్తూ, అభినయిస్తూ పాండవుల కథ చెబుతారు. పాండవాణి’ అనే ప్రాచీన జానపద సంప్రదాయం ద్వారా చాలా తక్కువ కాలంలో ప్రసిద్ధి పొందింది తీజన్‌బాయి.

లోకల్‌ కాదు... ఇంటర్నేషనల్‌!
పండగల నుంచి ప్రత్యేక సందర్భాల వరకు...గ్రామాల్లో ఏది జరిగినా తీజన్‌బాయి కార్యక్రమం ఉండాల్సిందే! అప్పటివరకు ‘లోకల్‌ టాలెంట్‌’ అన్నట్లుగానే ఉన్న తీజన్‌ ప్రతిభ, నాటకరంగ దిగ్గజం హబీబ్‌ తన్వీర్‌ దృష్టి సోకడంతో ఎక్కడికో వెళ్లింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం వచ్చింది. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి.
సాంస్కృతిక రాయబారిగా మారిషస్‌ నుండి ఇంగ్లాండ్‌ వరకు ప్రపంచమంతా పర్యటించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ రాసిన పుస్తకం ఆధారంగా దూరదర్శన్‌ కోసం శ్యామ్‌ బెనెగల్‌ రూపొందించిన ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’లో మహాభారత ఘట్టాలను ప్రదర్శించింది.

మహిళల హక్కుల కార్యకర్త
మళ్లీ ఒకసారి వెనక్కి వెళదాం... తీజన్‌బాయి అద్భుత ప్రతిభకు ప్రేక్షకులు జై కొట్టడం మాట ఎలా ఉన్నా... పార్థి తెగ ప్రజలు మాత్రం ఛీ కొట్టారు. ఒక మహిళగా పాండవాణి పాడినందుకు బహిష్కరించారు. అలా అని తీజన్‌బాయి నిరుత్సాహ పడలేదు. వెనక్కి అడుగు వేయలేదు. సొంతంగా గుడిసె నిర్మించుకొని, వంట పాత్రలు అరువు తెచ్చుకొని ఒంటరిగా జీనవ ప్రస్థానం ప్రారంభించింది. తీజన్‌ బాయి కళాకారిణి మాత్రమే కాదు మహిళా హక్కుల కార్యకర్త కూడా.                 – యాకుబ్‌ పాషా

తీజన్‌ జీవిత చరిత్ర... ది గర్ల్‌ హూ లవ్డ్‌ టు సింగ్‌
‘తీజన్‌బాయి: ది గర్ల్‌ హూ లవ్డ్‌ టు సింగ్‌’ పేరుతో తీజన్‌బాయి జీవిత చరిత్రకు పుస్తక రూపం ఇచ్చింది లావణ్య కార్తీక్‌.  రకరకాల వివక్షతలు అడుగడుగునా అడ్డుపడినా తీజన్‌ తన ప్రస్థానాన్ని ఆపలేదు. కలలు, కళల తోడు వీడలేదు. ఇది కళాకారిణి జీవిత చరిత్ర మాత్రమే కాదు. వైయక్తిక అనుభవాలు, జ్ఞాపకాల సారం మాత్రమే కాదు. వ్యక్తిత్వ వికాస పుస్తకం. విప్లవ మహిళ అంతరంగ రంగస్థలాన్ని ప్రపంచానికి పరిచయం చేసే పుస్తకం.

అడుగడుగునా సవాళ్లు 
స్కూల్లో చదువుకునే రోజుల్లో టీవీలో తీజన్‌బాయిని మొదటిసారి చూశాను. ఆమె నటన, శక్తిమంతమైన స్వరం, హావభావాలు పలికే తీరు నాకు ఎంతగానో నచ్చాయి. ఒక క్షణంలో భీముడిలా, మరుక్షణంలో ద్రౌపదిగా ఆ పాత్రలు వేగంగా మారిపోయేవి. చాలా సంవత్సరాల తరువాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది. ఊహించడానికి కూడా భయపడే ప్రతికూల పరిస్థితులలో తీజన్‌బాయి చూపిన ధైర్యం, పట్టుదల అసాధారణమైనది. రచయిత్రిగా నేను చెప్పాలనుకున్న మొదటి కథ ఆమెదే కావాలనుకున్నాను. పేదరికం, నిరక్షరాస్యత, కుల వివక్ష, స్త్రీ పట్ల ఉండే వివక్ష వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఒంటరిపోరాటంతో తనకంటూ ఒక జీవితాన్ని, గుర్తింపును ఏర్పర్చుకున్న దళిత మహిళ కథ ఇది.
– లావణ్య కార్తీక్, రచయిత్రి, తీజన్‌ బాయి: ది గర్ల్‌ హూ లవ్డ్‌ టు సింగ్‌

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)