Breaking News

సేఫ్టీ గాడ్జెట్స్‌.. ఈ టైంలో హెల్ప్‌ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్‌

Published on Sun, 06/15/2025 - 16:26

స్కూల్‌ బెల్‌ మోగింది. పిల్లలు కొత్త బుక్స్, బ్యాగ్స్‌తో రెడీ. కాని, పిల్లలకు చదువుతో పాటు వారి సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. అందుకే, ఈ బ్యాక్‌ టు స్కూల్‌ సీజన్‌లో పుస్తకాలతో పాటు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సేఫ్టీ గాడ్జెట్స్‌ గిఫ్ట్‌ చేయండి!

క్యూట్‌ ఫ్రెండ్‌! 
స్కూల్‌లో హోంవర్క్, టెస్టులు, ప్రాజెక్టులతో కొన్నిసార్లు ఒత్తిడిగా, ఒంటరిగా అనిపించవచ్చు. అప్పుడు పక్కన ఓ సపోర్టివ్‌ ఫ్రెండ్‌ ఉంటే ఎంతో బాగుంటుంది కదా? అలాంటి ఓ మిత్రుడే ఇప్పుడు వచ్చేశాడు. పేరు ‘ఎంకరేజింగ్‌ పిక్కల్‌’. ఇది బొమ్మ అయినా, దీని నవ్వు, రంగుల కళలు, మృదువైన స్పర్శతో పిల్లల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. 

ఓ టెస్టులో తక్కువ మార్కులొచ్చినా, ప్రాజెక్ట్‌ ఆలస్యం అయినా, ఈ పిక్కల్‌ను చూసి ఒక్కసారి మాట్లాడితే చాలు. మనసులో ఈ మాటలు వినిపిస్తాయి: ‘ఇంకొంచెం ట్రై చెయ్య్, నువ్వు చాలా గ్రేట్‌’ అని. ఒక చిన్న సైజు మానసిక మిత్రుడు అనే చెప్పొచ్చు. కార్న్, క్యాబేజీ, హనీపీచ్‌ లాంటి ఇతర ఆకారాల్లోనూ దొరుకుతుంది. ఎవరి స్టయిల్‌కి తగ్గట్టు వారు సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ధర డిజైన్‌ మీద ఆధారపడి ఉంటుంది.

నో‘లాస్‌’
స్కూల్‌ టైమ్‌ వచ్చేసింది! బ్యాగ్, బాటిల్, టిఫిన్‌ , బాక్స్‌– ఇలా వీటిలో ఏ ఒక్కటి మిస్‌ అయ్యినా అమ్మానాన్నలకు టెన్షన్‌ గ్యారంటీ! ‘అమ్మా, నా బాటిల్‌ పోయింది’, ‘నాన్నా, బ్యాగ్‌ మర్చిపోయా’ అన్న డైలాగ్స్‌తో వాటిని తిరిగి తెచ్చే వరకు పిల్లలు విసిగిస్తూనే ఉంటారు. 

ఇందుకు పరిష్కారమే ఈ ‘ఎయిర్‌ ట్యాగ్‌’. ఇది చిన్న బిళ్లలాగ ఉండే మాయపరికరం. దీనిని పిల్లల వస్తువులకు తగిలించండి. ఇకపై వారు ఏది ఎక్కడ మరచిపోయినా, దీనికి అనుసంధానమైన యాప్‌ ద్వారా ఫో¯Œ లో వాటి లొకేషన్‌ కనిపెట్టచ్చు. ధర రూ.11,900 కి నాలుగు ట్యాగ్స్‌ వస్తాయి.

బాడీగార్డ్‌ బర్డీ!  
ఇప్పటివరకు ప్రమాదం వచ్చిన ప్రతిసారి ‘అమ్మా! నాన్నా!’ అని ఒక్క అరుపుతో పరుగులు తీసే చిన్నారులు, స్కూల్‌కు వెళుతున్నారంటే, తమను తాము కాపాడుకునే స్టేజ్‌కి వచ్చేశారని అర్థం. అందుకే, కండబలం కంటే ముందు బుద్ధిబలంతో సమస్యను పరిష్కరించేలా నేర్పించాలి. ఇందుకోసం, పిల్లలతో పాటు స్కూల్‌కి ఈ బాడీగార్డ్‌ను కూడా పంపించండి. 

పేరు ఈ ‘బర్డీ’. చిన్న కీ చైన్‌లా ఉంటుంది. కాని, ప్రమాదం వచ్చినప్పుడు పిల్లలు ఒక్కసారి దీనికున్న బటన్‌ నొక్కితే చాలు. ఇక అది చేసే శబ్దంతో దొంగలు పారిపోవాల్సిందే! వెంటనే, ఒక పెద్ద అలారం చెవుల్లో మెగాఫోన్‌ పెట్టినట్టు అరుస్తుంది. ఇంకా చీకట్లో కూడా ఈ బర్డీ టార్చ్‌ మోడ్‌లో వెలుగుతూ, ‘ఇదిగో లైట్‌ ఉంది, నువ్వు కామ్‌గా పో’ అనే వార్నింగ్‌తో దొంగలను తరిమి కొడుతుంది. ఇది పిల్లల బ్యాగ్‌కు వేలాడే ఒక మినీ సూపర్‌ హీరో!  

(చదవండి: ఆ కుంటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..! ఏ రేంజ్‌లో స్వాగతం పలికారంటే..)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)