Breaking News

టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!

Published on Thu, 10/24/2024 - 15:16

ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్‌ మిలియనీర్‌ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటుంటారు. ఆ ప్రక్రియలకు సంబంధించి..కాంతివంతమైన చర్మం కోసం ఏం చేయాలో ఇంతకమునుపు పంచుకున్నారు. తాజాగా జుట్టు రాలు సమస్యను అరికట్టడం, సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలను షేర్‌ చేశారు. 

జన్యుపరంగా బ్రయాన్‌కి బట్టతల రావాల్సి ఉంది. అయితే ఆయన వృద్ధాప్యాన్ని నెమ్మదించే ప్రక్రియల్లో భాగంగా తీసుకుంటున్న చికిత్సలు కారణంగా ఆ సమస్య బ్రయాన్‌ దరిచేరలేదు. ఆ క్రమంలోనే బ్రయాన్‌ తాను జుట్టు రాలు సమస్యకు ఎలా చెక్‌పెట్టి కురులను సంరక్షించుకునే యత్నం చేశారో వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం ప్రారంభించి బూడిద రంగులో మారిపోయిందట. అలాంటి తనకు మళ్లీ ఇప్పుడూ 47 ఏళ్ల వయసులో జుట్టు మంచిగా పెరగడం ప్రారంభించింది. 

అలాగే జుట్టు రంగు కూడా మంచిగా మారిందని చెప్పుకొచ్చారు. జుట్టు పునరుత్పత్తికి తాను ఏం చేశానో కూడా తెలిపారు బ్రయాన్‌. ముఖ్యంగా ప్రోటీన్‌​, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జుట్టుని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. మెలటోనిన్, కెఫిన్, విటమిన్ డీ-3 వంటి పోషకాహారం తోపాటు రెడ్ లైట్ థెరపీని కూడా తీసుకున్నానని అన్నారు. అంతేగాదు ఈ రెడ్‌లైట్‌ థెరపీని రోజంతా తీసుకునేలా ప్రత్యేకమైన టోపీని కూడా ధరించినట్లు వివరించారు. 

ముఖ్యంగా తలనొప్పి వంటి రుగ్మతలు దరిచేరకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే కచ్చితంగా జుట్టు రాలు సమస్యను నివారించగలమని అన్నారు. అలాగే తాను జుట్టు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడూ హెయిర్ గ్రోత్ థెరపీలను అందిస్తున్న కంపెనీలతో టచ్‌లో ఉండేవాడినని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం గురించి ఆలోచించాల్సిన పని ఉండదని, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

కాగా, బ్రయాన్‌ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టేలా యవ్వనంగా ఉండేందుకు ఇప్పటి వరకు అత్యాధునికి వైద్య చికిత్సల నిమిత్తం సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెట్టిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఆ ప్రక్రియలో భాగంగా  శరీరంలోని మొత్తం ప్లాస్మాని కూడా మార్పిడి చేయించుకున్నారు బ్రయాన్‌ . 

(చదవండి: 'స్వీట్‌ స్టార్టప్‌': జస్ట్‌ కప్‌ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!)


 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)