Breaking News

యవ్వనం కోసం మిలియనీర్‌ పాట్లు : వికటించిన ప్రయోగం, కానీ!

Published on Tue, 11/19/2024 - 12:56

టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్  వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి,  యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల  బృందం మద్దతుతో,  విపరీతమైన మందులు, వ్యాయామం,  అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్‌ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు.


యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్‌ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది.  మీకెప్పుడైనా  ఇలా జరిగిందా అంటూ తన  ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో   పంచుకున్నాడు. డోనర్‌ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో  తన ముఖం  ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే  అతని కఠినమైన 1,950-కేలరీల  డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత  ఈ పరిణాం  చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు  తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై  తమ టీం పని చేస్తోందన్నాడు.

 కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్, యాంటీ యాజింగ్‌ మందులు చికిత్సలతో  తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్‌ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)