Breaking News

రజనీ చాయ్‌

Published on Sun, 10/22/2023 - 00:53

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్‌లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్‌ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్‌ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్‌లో హల్‌చల్‌.

కొచ్చిన్‌లో ఏదో షూటింగ్‌ కోసం వెళ్లిన సినిమా యూనిట్‌ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్‌! టీ అమ్ముతూ. రజనీకాంత్‌ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్‌లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్‌లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్‌ ప్రభు. ఫోర్ట్‌ కొచ్చిన్‌ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్‌’ అనే ప్యూర్‌ వెజిటేరియన్‌ హోటల్‌ నడుపుతున్నాడు. లెమన్‌ టీ చేయడంలో దిట్ట.

మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్‌తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్‌లోకి వచ్చేశాడు. నాదిర్‌షా అనే మలయాళం డైరెక్టర్‌ ఇతణ్ణి ఫేస్‌బుక్‌లో పెట్టేసరికి వైరల్‌ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్‌కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)