Breaking News

చిరునవ్వుల చదువిద్దాం...

Published on Wed, 06/10/2026 - 05:48

రెండు నెలల తర్వాత బడి. బ్లాక్‌బోర్డు ఎదుట టీచర్‌ నిలిచే సమయం. కొత్త క్లాసులో పిల్లలు. కొత్త లెసన్‌ ప్లాన్లు. అయితే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. పిల్లలకు చిర్నవ్వుతో స్వాగతం పలకడం. వారిని వాత్సల్యంగా పలకరించడం. పిల్లలు పేరెంట్స్‌ కన్నా టీచర్స్‌తో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్లే ‘స్కూల్‌ అమ్మ’, ‘స్కూల్‌ నాన్న’. పిల్లలు చదువులో ‘పాస్‌’ అవ్వాలంటే,  టీచర్లు మొదట వాళ్ల దృష్టిలో పాస్‌ కావాల్సిందే. ఎలా?

పిల్లలకు టీచర్లు బాగా తెలుసు. టీచర్లకు పిల్లలందరూ తెలియకపోయినా. ఒక్కోసబ్జెక్ట్‌కు ఇద్దరు ముగ్గురు టీచర్లు (సార్లు) ఉంటే వారిలో పాఠం ఎవరు బాగా చెప్తారో, ఎవరు చిరాకు పడతారో, ఎవరు ఎక్కువ కోపంగా ఉంటారో, ఎవరు పనిష్మెంట్‌లు ఎక్కువ ఇస్తారో పిల్లలకు తెలిసిపోతుంది. పిల్లలే ఆ సమాచారాన్ని ఒకరికి మరొకరు ఇచ్చుకుంటారు.

స్కూళ్లు రీ ఓపెన్‌ అయినప్పుడు ‘మేథ్స్‌కు ఫలానా సార్‌ వస్తే బాగుండు’ అని కొందరు పిల్లలు ‘ఫలానా సార్‌/టీచర్‌ వద్దు బాబోయ్‌’ మరికొందరు పిల్లలు అనుకుంటారు. కాని ఎవరు రావాలనేది వారి చేతుల్లో ఉండదు. కాని వచ్చిన వారు తమ వ్యవహార శైలితో పిల్లలకు నచ్చడం వారి చేతుల్లోనే.

‘ఈ ఏడాదంతా ఈ టీచర్లే’ అని పిల్లలకు స్కూల్‌ మొదటిరోజు తెలిసినప్పుడు ప్రతి టీచర్‌ను వాళ్లు ఇష్టపడేలా ఉంటే ఎంత బాగుంటుంది? టీచర్లు పిల్లల కోసం ఉన్నారు. పిల్లలు ఉన్నారు కనుక ఉన్నారు. కాబట్టి పిల్లలతో పాఠం సమయంలో కఠినంగా, మిగిలిన సమయాల్లో ప్రేమగా ఉంటూ కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు.

కేస్‌ స్టడీ 1: సుజాత టీచర్‌ 
స్కూల్‌ తెరిచిన ఫస్ట్‌రోజు సుజాత మేడమ్‌ క్లాస్‌లోకి చాక్‌పీస్‌తో వెళ్లరు. ఒక పెద్ద చార్ట్, కొన్ని కలర్‌ స్కెచ్‌లు తీసుకెళ్తారు. బోర్డు మీద ముందో స్మైలీ గీసి ‘నా సమ్మర్‌ స్టోరీ’ అని రాసి, తాను సెలవుల్లో ఏం చేశారో మూడు నిమిషాలు చెప్తారు. ‘నేను మా ఊరెళ్లా, ఢిల్లీ చూశా, చాలా పుస్తకాలు చదివా’. తర్వాత పిల్లల్ని అడుగుతారు– ‘మరి మీ స్టోరీ ఏంటి?’ 40 మంది, 40 కథలు. ఒకడు అమ్మమ్మ వాళ్ల ఊర్లో బావిలో ఈత నేర్చాడు, ఒక పాప పిల్లి పిల్లకు పేరు పెట్టింది. నవ్వులు, కేకలు. పీరియడ్‌ అయిపోయింది. ఇలా క్లాసులు మొదలైతే పిల్లలు ఉత్సాహంగా ముందుకు దూకరూ?

కేస్‌ స్టడీ 2: రవి సార్‌ 
రవి సార్‌ మ్యాథ్స్‌ అంటే పిల్లలకు దడ. సెలవుల తర్వాత మొదటి క్లాస్‌లో ఆయన బోర్డు మీద లెక్కల సూత్రం రాయరు. బదులుగా ‘మీలో ఎంతమందికి క్రికెట్‌ అంటే ఇష్టం?’అని అడుగుతారు. అందరూ చేతులు ఎత్తాక ‘సరే, ఐపీఎల్‌లో కోహ్లీ 5 మ్యాచ్‌లలో 45, 67, 2, 89,12 పరుగులు చేశాడు. యావరేజ్‌ ఎంత?’ అంటారు. పిల్లలు ఆన్సర్‌ చెప్పడానికి టకటకా పెన్నులు బయటకు తీస్తారు. లెక్కల క్లాసు ఇలా మొదలుపెట్టి రవిసార్‌ అనవసర భయాన్ని తగ్గిస్తారు. టీచర్లు దారి చూపేవారు. అయితే వారికి సూచనలు చేయవచ్చు.

→ ‘అటెండెన్స్’ కంటే ముందు ‘అటెన్షన్‌’
పేరుతో పిలవండి, నంబర్‌తో కాదు. రిజిస్టర్‌ లో ‘రోల్‌ నంబర్‌ 12’ అని ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్‌కి పేరు ఉంది. ‘ఉత్కర్ష్‌... ఓ అక్కడ కూచున్నావా’ అని అనండి. ‘మేడంకి నా పేరు తెలుసా’ అనే ఫీలింగ్‌ ఉత్కర్ష్‌కి ధైర్యాన్నిస్తుంది. పరిశోధనలు చెప్తున్నాయి... పిల్లవాడిని పేరుతో పిలిచే టీచర్‌ క్లాస్‌లో హాజరు 23 శాతం ఎక్కువ ఉంటుందని. క్లాస్‌లో పేరు వినిపించే విద్యార్థి తన ఉనికికి సంతోషపడతాడు. ‘క్లాస్‌ లీడర్‌ ఎవరు?’... ‘బోర్డు తుడిచే మినిస్టర్‌ ఎవరు?’...‘పూలమొక్కలకు నీళ్లు పోసే గార్డెనర్‌ ఎవరు?’అని కొన్ని బాధ్యతలు ఇవ్వండి. పిల్లలకు ‘ఓనర్‌షిప్‌’ వస్తే బడి నచ్చుతుంది.

→ ఆరా తీయండి
మొదటిరోజు రోల్‌ కాల్‌ తీసేటప్పుడు మూడు నాలుగు పేర్లకు జవాబు రాదు. ‘ఆబ్సెంట్‌’ అని టిక్‌ పెట్టి వదిలేయకండి. ఆ పిల్లాడు ఎందుకు రాలేదు? టీసీ తీసుకున్నాడా? పనిమీద వేరే ఊరు వెళ్లాడా? లేక ‘బడి వద్దు’ అని మారాం చేస్తున్నాడా? 6వ క్లాస్, 9వ క్లాస్‌లో డ్రా΄ûట్స్‌ ఎక్కువ. ఫోన్‌ చేసి కనుక్కోండి. ‘ఏమైంది నాన్నా, రేపు వస్తావా?’ అని ఆ పిల్లాడితో మీరే మాట్లాడితే వాడి అమ్మానాన్నలకు ‘ఈ స్కూల్లో నా కొడుకుని పట్టించుకుంటారు’ అనే నమ్మకం వస్తుంది.

→ మీ నవ్వే వాళ్లకు టానిక్‌
ఫిన్లాండ్‌లో టీచర్లు మొదటి రెండు వారాలు అసలు పుస్తకం ముట్టుకోరు. కేవలం పిల్లలతో ‘బాండింగ్‌’ చేస్తారు. ఫలితం? ప్రపంచంలోనే బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌గా నిలిచింది. అందుకే మొదటిరోజు పిల్లలతో బాండింగ్‌ ఏర్పరుచుకోవడం మీదే దృష్టి పెట్టాలి. ‘ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’..‘నీకు ఏ ఆట ఇష్టం?’... ‘అన్నం తిన్నావా?’ ఈ రెండు నిమిషాలు వాడికి ‘సేఫ్‌ జోన్‌’ క్రియేట్‌ చేస్తాయి. పిల్లవాడు మీతో కనెక్ట్‌ అయితే, సబ్జెక్ట్‌తో ఆటోమేటిక్‌ గా కనెక్ట్‌ అవుతాడు. 

డియర్‌ టీచర్స్‌... విద్యార్థికి ‘బడి’ అంటే ‘బిల్డింగ్‌’ కాదు, మీరే. చాక్‌పీస్‌ పట్టుకునే ముందు, పిల్లాడి చేయి పట్టుకోండి. వాడు మిమ్మల్ని గురువుగా, గైడ్‌గా చూస్తాడు. అది చాలు, ఈ ఏడాది మీ క్లాస్‌ నూరుశాతం పాస్‌.

Videos

11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్

లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

వెన్నుపోటుకు రెండేళ్లు YSRCP నిరసన

అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంటే?

నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు

రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!

ఆ రోజు సూర్యుడు మాయం, శతాబ్దంలోనే అతిపెద్ద వింత!

నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ

సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ

Photos

+5

చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్‌సీపీ సమర శంఖం (ఫొటోలు)

+5

కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)

+5

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

+5

‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)

+5

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)