Breaking News

మామిడిపండుతో టేస్టీ డిజర్ట్‌ ఇలా తయారుచేసుకోండి..

Published on Fri, 06/16/2023 - 17:07

పండ్లలన్నింటిలో రారాజు మామిడి పండు. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక రుచి ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక విటమిన్లు, పోషకాలను కలిగి ఉంటుంది. 

ముఖ్యంగా మామిడి పండ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, జింక్ మరియు కార్బోహైడ్రేట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.  మామిడి పండ్ల సీజన్‌ పూర్తికాకముందే రుచికరమైన మంగోలీసియస్‌ డిజర్ట్‌ను ఇలా తయరుచేసుకోండి.

మంగోలీసియస్‌ డిజర్ట్‌ తయారికి కావాల్సినవి

మామిడి పండ్లు – రెండు
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
బాదం పలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు
జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు
 పిస్తాపలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు
సేమియా – అరకప్పు
పాలు– నాలుగు కప్పులు
చక్కెర – పావు కప్పు

మంగోలీసియస్‌ డిజర్ట్‌ తయారీవిధానం ఇలా..
మామిడి పండు తొక్క, టెంక తీసేసి, ముక్కలుగా తరిగి ప్యూరీలా గ్రైండ్‌ చేయాలి. టేబుల్‌ స్పూను నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో మిగతా నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించాలి. సేమియా వేగాక, పాలు పోసి పదినిమిషాలు కాగనివ్వాలి.

పాలు మరిగాక చక్కెర వేసి కరిగేంత వరకు తిప్పి దించేసి చల్లారనివ్వాలి.  చల్లారిన పాల మిశ్రమంలో మామిడి పండు ప్యూరీ, డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. అరగంట తరువాత బయటకు తీసి ఒకసారి కలుపుకుని సర్వ్‌ చేసుకోవాలి.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)