Breaking News

89 ఏళ్ల పంచాయతీ ప్రెసిడెంట్‌!ఆమె ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే!

Published on Thu, 08/31/2023 - 13:31

కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్‌ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్‌! అనిపించుకుంటున్నారు. 

వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్‌ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్‌ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్‌లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్‌ అనిపించుకుంటోంది.

మిల్లెట్స్‌ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్‌నెస్‌ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్‌. వీరమ్మాళ్‌ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్‌ అడ్మిన్‌స్ట్రేటివ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ సుప్రియా సాహు ఆన్‌లైన్‌ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్‌లో కూడా లీడర్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఇండియన్‌​ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!)

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)