Breaking News

అందాల రాధగా తమన్నా..ట్రెడిషన్‌ లుక్‌ అదుర్స్‌!

Published on Sun, 08/25/2024 - 08:00

కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో టాలీవుడ్‌ నటి మిల్కీ బ్యూటీ అందమైన రాధలా మిస్మరైజ్‌ చేస్తుంది. రాధమ్మ ఇలానే ఉంటుందా అనేంతలా చూపు తిప్పుకోని అందంతో అలరించింది. తమన్నా భాటియా రీసెంట్ గా స్త్రీ 2 సినిమా ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి హెడ్ లైన్లో నిలిచింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే కాకుండా..ఐటమ్ లేడీ, విలన్ పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాంటి తమన్నా ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించి సందడి చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 

భారతీయ హస్తకళకు సంబంధించిన అల్లికలతో కూడిన లెహెంగాలో తమన్నా 'రాధారాణిలా' తలుక్కుమంది. ప్రముఖ డిజైనర్‌ కరణ్‌ టోరానీ ప్రేమకు చిహ్నమైన రాధ లుక్‌ని అత్యంత ప్రేమమయంగా ఆవిష్కిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ తమన్నా భాటియా ధరించిన లెహంగా అది వెల్లడించేలా అత్యంత అందంగా తీర్చిదిద్దాడు. రాధ కృష్ణులు మధ్య స్వచ్ఛమైన బంధాన్ని తెలిపేలే రాధ లుక్‌ని ఆవిష్కరించాడు. 

ఇక్కడ తమన్నా ‘చంద్రమల్లికా మన్మయి లెహంగా సెట్‌’లో ఉంది. ఈ లెహెంగా సెట్‌  “లష్ ఆర్గాన్జా, జెన్నీ సిల్క్‌" ఫ్యాబ్రిక్‌. నీలి గులాబి రంగుల కలయికతో కూడిన లెహంగా తమన్నాకి అందాన్ని రెట్టింపు చేసింది. దీనిపై ఉన్న ఈహెరిటేజ్‌ డబ్కా వర్క్‌, మోతీ గోల్డ్‌ సీక్విన్స్‌, సిగ్నేచర్‌ ఎంబ్రాయిడరీలతో అట్రాక్టివ్‌గా ఉంది.. ఈ లెహంగా సెట్‌ పూర్తి పర్పుల్‌ ఒద్నీతో అయితే ధర రూ. 435,500/-, అదే ఆక్వా ఒధ్నితో రూ. 399,500 ఉంటుందట. ఇక్కడ రాధా దేవిలా ఉన్న తమన్నా ఓ అందమైన చిలకతో సంభాషిస్తున్న స్టిల్‌ అత్యంత అద్భుతంగా ఉంది. 

 

(చదవండి: మిసెస్‌ సౌత్‌ ఇండియా వర్షారెడ్డి)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)