Breaking News

Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?

Published on Wed, 03/19/2025 - 18:05

తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌​ఎస్‌)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్‌ చేస్తూనే ఉంది. 

ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా.  నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు  ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్‌ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్‌ విల్మోర్‌ ప్రత్యేక డైట్‌ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్‌టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్‌ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.

ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..
వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్‌ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్‌ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్‌ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. 

మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్‌ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ  జస్ట్‌​ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్‌ని ఉపయోగించినట్లు సమాచారం.

సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..
విలియమ్స తన మిషన్‌​లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. 

అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్  మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్‌డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.

(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్‌ ఫ్యామిలీ..)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)